RRR's Naatu Naatu: ఎన్టీఆర్, చరణ్ చిందేశారు... ఆల్రెడీ ఓ రికార్డు కొల్లగొట్టారు!

'ఆర్ఆర్ఆర్'లో 'నాటు నాటు...' సాంగ్ విడుదలైంది. ఆల్రెడీ ఆడియ‌న్స్‌కు న‌చ్చింది. ఈ సాంగ్ ఓ రికార్డు కూడా కొల్లగొట్టింది. అదేంటో తెలుసుకోండి.

Continues below advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఓ పాటకు స్టెప్పులు వేస్తే... ఇది ఒకప్పుడు ఊహ. కానీ, ఇప్పుడు కాదు. ఆ ఊహను దర్శక ధీరుడు రాజమౌళి నిజం చేశారు. ఇద్దరినీ ఓ సినిమాలోకి తీసుకొచ్చారు. ఓ పాటకు స్టెప్పులు వేయించారు. ఆ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం '. ఆల్రెడీ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 'నాటు నాటు...' సాంగ్ వాటిని మరింత పెంచిందని చెప్పాలి. ఎన్టీఆర్, చరణ్ స్టెప్పులు వేస్తుంటే... చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకులకు ఈ పాట ఐ ఫీస్ట్... ప్రేక్షకులకు కనుల విందు అని చెప్పాలి. ఇప్పుడీ పాట సౌతిండియాలో 24 గంటల్లో ఎక్కువమంది చూసిన పాటగా రికార్డు సృష్టించింది. ఒక్క రోజులో ఈ పాటకు 10.4 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ గాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Continues below advertisement

ప్రస్తుతం యూట్యూబ్ లో తెలుగు వెర్షన్ 'నాటు నాటు...' టాప్ లో ట్రెండ్ అవుతోంది. 
'నాటు నాటు...'లో ఒలీవియా మోరిస్ కూడా హైలైట్ అయ్యాయి. సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా ఆమె కనిపించనున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ జోడీగా ఆలియా భట్ నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది. ఈ నెలాఖరున మూడో పాటను, డిసెంబర్ లో ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. 

Also Read: టికెట్ ధరలు పెంచుతారా? లేదా? ఏపీ ఆన్‌లైన్ టికెట్ల‌ విధానంలో స్పష్టత వచ్చిందా? లేదా!?Also Read: 'శ్యామ్ సింగ రాయ్' రెడీ... టీజర్ విడుదల ఎప్పుడంటే?
Also Read: సంతాపమా... ప్రచారమా? ఏంటిది తలైవా?? ర‌జ‌నీకాంత్‌పై నెటిజ‌న్స్ ఫైర్‌
Also Read: 'పుష్పక విమానం' చూశాక... విమానం ఎక్కి విదేశాలు చెక్కేస్తున్న విజయ్ దేవరకొండ
Also Read: తిరిగిచ్చేద్దాం అన్న కేటీఆర్.. ఇలాంటోళ్లు ఉండాలన్న మహేశ్... ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్
Also Read: 'అఖండ' విడుదల తేదీ ఖరారు... బాలకృష్ణతో భారీ చిత్రాల సందడి మొదలు!
Also Read: భార్య పేరు కలిసి వచ్చేలా... ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేసిన హీరో
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola