అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోవడమే కాదు దాన్ని నిలబెట్టుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది సమంత. వ్యక్తిగత జీవితంలో ఊహించని సమస్య వచ్చినప్పటికీ ఆ ప్రభావం తన కెరియర్ పై పడకుండా ప్లాన్ చేసుకుంటోంది. రోజురోజుకీ మరింత ఉత్సాహంగా ఉంటూ..తన ఫాలోవర్స్ లో ఉత్సాహాన్ని నింపే పోస్టులు పెడుతోంది. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ స్టేటస్ లో సామ్ పెట్టిన పోస్టులు వైరల్ అవుతోంది.
చెన్నైలో కుండపోత వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. సామ్ కేవలం ఒక్క రోజు తన పేరెంట్స్ తో ఉండేందుకు చెన్నై వెళ్లింది. తన పెట్ డాగ్స్ ని ఒక్కరోజు కోసం వదిలి వెళ్తున్నానంటూ ఇన్ స్టా లో పేర్కొంది. చైతూతో వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేసిన తర్వాత ఆ బాధ నుంచి బయటపడేందుకు ఏమాత్రం సమయం దొరికినా తల్లిదండ్రులు, స్నేహితులతో స్పెండ్ చేస్తోంది. ఈ మధ్యే సామ్ స్నేహితురాలితో తీర్థయాత్రలకు వెళ్లొచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బాల్కనీ నుంచి వర్షపు వాతావరణం తెలియజేసే ఫొటోస్ పోస్ట్ చేసింది. ''ఎప్పుడూ ఏదో మంచి జరుగుతూనే ఉంటుంది.. గుర్తుంచుకోండి'' అని షేర్ చేసిన కొటేషన్ మరింత వైరల్ అవుతోంది.