Australia Beats Pakistan By 5 Wickets: భారత్, పాకిస్తాన్ దేశాలతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంకలోనూ క్రికెట్ ఫీవర్ సహజం. ముఖ్యంగా పాక్, భారత్‌లలో వరల్డ్ కప్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దాయాది జట్టు చేతిలో ఓటమిని అసలు జీర్ణించుకోలేరు. సెమీస్ చేరకుండానే భారత్ కథ ముగియగా.. తాజాగా కప్పు నెగ్గుతుందని భావించిన పాక్ జట్టు రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో నిరాశగా ఇంటిబాట పట్టింది.


టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా గురువారం రాత్రి జరిగిన రెండో సెమీఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా ఐదు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 19వ ఓవర్లో మాథ్యూ వేడ్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో మరో 6 బంతులు మిగిలుండగానే ఆసీస్ ఫైనల్ చేరుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో కంగారూలు తలపడనున్నారు. ఏ జట్టు గెలిచినా సరికొత్త ఛాంపియన్‌గా అవతరిస్తుంది. 
Also Read: ఈసారి కొత్త విజేత ఖాయం.. పాక్‌ను చిత్తు చేసి ఫైనల్స్‌కు చేరిన ఆస్ట్రేలియా!


పాక్ జట్టు ఓడిపోగానే ఆ దేశానికి చెందిన ఓ బాలుడు వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఈ వీడియోను పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పోస్ట్ చేశాడు. తమ జట్టు అద్బుతంగా ఆడి.. చివరికి ఓటమి పాలైతే పరిస్థితి ఇలా ఉంటుందని అక్తర్ తన పోస్టులో రాసుకొచ్చాడు. సలేహ్ అనే బాలుడు పాక్ ఓటమిని జీర్ణించుకోలేక ఏడ్చేశాడు. జట్టు అద్బుతంగా ఆడితే అభిమానులు బాగా ఇన్వాల్స్ అవుతారు. చివరికి ప్రతికూల ఫలితం వస్తే ఇలాంటి పరిస్థితులు కనిపిస్తాయని అక్తర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. 






అక్తర్ ఏమన్నాడంటే..
రెండో సెమీస్‌లో పాక్ ఓటమిపై మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ‘పాక్ జట్టు అదనంగా మరో 20 పరుగులు  చేసి ఉంటే ప్రయోజనం ఉండేది. మధ్య ఓవర్లలో నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం ప్రతికూలాంశం. దేశ ప్రజల గుండెలు ముక్కలయ్యాయి. జట్టు మాత్రం అసమాన ప్రతిభ చూపింది. దురదృష్టవశాత్తూ పాక్ జట్టుకు ఓటమి తప్పలేదు. అదే సమయంలో ఆసీస్ జట్టు గొప్పగా ఆడిందని అంగీకరించాలని’ అక్తర్ మరో పోస్టులో రాసుకొచ్చాడు.
Also Read: Indian Team Squad: 'హిట్‌ మ్యాన్‌' శకం మొదలు..! కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ.. కివీస్‌ సిరీసుకు జట్టు ఎంపిక






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి