పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా 'భీమ్లా నాయక్'. ఇటు షూటింగ్... అటు ఎడిటింగ్... సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ షూటింగ్ చేసిన సినిమాను చాలావరకూ ఎడిటింగ్ చేశారు. ఇటీవల ఎడిటింగ్ చేసిన సన్నివేశాలను పవన్ కల్యాణ్ చూశారు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ చాలా బావుందని, ఆయనను పవన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. దాంతో రవి కె. చంద్రన్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన్ను అభినందిస్తూ... పవన్ స్వహస్తాలతో రాసిన నోట్ ను ట్వీట్ చేశారు.
"డియర్ రవి కె. చంద్రన్ సార్... 'భీమ్లా నాయక్' సినిమాలో మీరూ ఓ భాగం అయినందుకు థాంక్యూ. మీ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాకు మీరు తీసుకొచ్చిన మార్పు చాలా కీలకమైనది" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎడిటెడ్ ఫుటేజ్ చూసిన తర్వాత పవన్ కల్యాణ్ గారు ఈ విధంగా అభిప్రాయం వ్యక్తం చేశారని రవి కె. చంద్రన్ ట్వీట్ చేశారు.
త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా దగ్గుబాటికి జంటగా సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్, 'అంత ఇష్టం', 'లా లా భీమ్లా నాయక్' పాటలకు... ప్రచార చిత్రాలకు అద్భుత స్పందన లభిస్తోంది.
Also Read: బంపర్ మెజారిటీ మీద కన్నేసిన నితిన్... వచ్చే ఏడాది వేసవిలో ప్రజల ముందుకు!
Also Read: 'రాజా విక్రమార్క' సమీక్ష: రాజావారి వేట బావుంది
Also Read: పుష్పక విమానం సమీక్ష: ఈ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిందా?
Also Read: స్పెషల్ ఆప్స్ 1.5 సమీక్ష: హాట్‌స్టార్ నుంచి అదరగొట్టే వెబ్ సిరీస్.. తెలుగులో కూడా!
Also Read: 'కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'
Also Read: 'రాధేశ్యామ్' ఫస్ట్ సాంగ్ కి ముహూర్తం ఫిక్స్ అయిందా..?
Also Read: ఐదు పదులు దాటినా కెవ్వు కేక.. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటున్న మలైకా..