నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. ఎడిటర్ ఎస్.ఆర్. శేఖర్ అలియాస్ ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ భాగస్వామ్యంతో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. "ఈసారి థియేటర్ కు వచ్చేది బంపర్ మెజారిటీతో" అని శ్రేష్ట్ మూవీస్ ఓ పోస్టర్ విడుదల చేసింది.
ప్రస్తుతం 'మాచర్ల నియోజకవర్గం' చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. యాక్షన్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. నితిన్ ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని యాక్షన్ అవతారంలో కనిపిస్తారని, అతడిని దర్శకుడు ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి కొత్తగా చూపిస్తున్నారని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. 'భీష్మ', 'మాస్ట్రో' తర్వాత నితిన్, మహతి స్వర సాగర్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్. మామిడాల తిరుపతి మాటలు రాస్తున్నారు. సాహి సురేష్ కళా దర్శకత్వ బాధ్యతలు, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కరోనా కారణంగా నితిన్ లాస్ట్ సినిమా 'మాస్ట్రో' ఓటీటీ వేదికలో విడుదలైంది. ఈసారి మాత్రం థియేటర్లలోకి రావాలని బలంగా ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ విడుదలైన 'మాచర్ల నియోజకవర్గం' పోస్టర్లు చూస్తే యాక్షన్ ఫిల్మ్ అని తెలుస్తోంది. కొంత విరామం తర్వాత నితిన్ చేస్తున్నమాస్ యాక్షన్ సినిమా ఇది.
Also Read: 'రాజా విక్రమార్క' సమీక్ష: రాజావారి వేట బావుంది
Also Read: పుష్పక విమానం సమీక్ష: ఈ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిందా?
Also Read: స్పెషల్ ఆప్స్ 1.5 సమీక్ష: హాట్‌స్టార్ నుంచి అదరగొట్టే వెబ్ సిరీస్.. తెలుగులో కూడా!
Also Read: 'కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'
Also Read: 'రాధేశ్యామ్' ఫస్ట్ సాంగ్ కి ముహూర్తం ఫిక్స్ అయిందా..?
Also Read: ఐదు పదులు దాటినా కెవ్వు కేక.. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటున్న మలైకా..

ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి