ప్రపంచంలో ఎక్కువ మరణాలకు కారణమైన మహమ్మారి మధుమేహం. అందుకే ఇలాంటి మాయదారి రోగం గురించి ప్రజల్లో అవగాహన ఉండాలనే లక్ష్యంగా ‘వరల్డ్ డయాబెటిస్ డే’ను నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరూ మధుమేహ లక్షణాలు, తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు, రాకుండా జాగ్రత్త పడడం, ప్రీ డయాబెటిక్ లక్షణాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. మధుమేహం అంటే రక్తంలో గ్లూకోజ్ అధిక స్థాయిలో ఉండడం. ఇలా ఉండడం చాలా అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. 


డయాబెటిస్ బారిన పడకుండానే ప్రీ డయాబెటిక్ స్థాయిలోనే జాగ్రత్త పడితే ఆ మాయదారి రోగాన్ని రాకుండా అడ్డుకోవచ్చు. ప్రీ డయాబెటిక్ అంటే మధుమేహం రావడానికి ముందు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం అన్నమాట. అవి స్థిరంగా పెరగవు. తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. కొన్ని రకాల లక్షణాల ద్వారా ప్రీ డయాబెటిక్ దశను కనిపెట్టవచ్చు. ఆ దశలోనే జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం రాకుండా తప్పించుకోవచ్చు. 


లక్షణాలు ఇలా ఉంటాయి
1. చాలా దాహం వేస్తుంది. నీళ్లు తాగిన కాసేపటికే నోరు తడారిపోతుంటుంది. నిజానికి దీన్ని ఎవరూ పట్టించుకోరు, కానీ పట్టించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మధుమేహం వచ్చే ముందు కనిపించే ముఖ్య లక్షణం ఇది. 
2. తరచూ మూత్రవిసర్జనకు వెళ్లడం. నీళ్లు తాగాక రెండు మూడు గంటల దాకా మనకు మూత్రం రాదు. కానీ ప్రీ డయాబెటిక్ దశలో ఉన్న వాళ్లకి మాత్రం కొంచెంకొంచెంగా అరగంటకోసారి వస్తుంది. 
3. చూపు తేడాగా అనిపిస్తుంది. బ్లర్ అవుతున్నట్టు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అస్పష్టంగా కనిపించడం, మసకగా అనిపించడం జరుగుతుంది. 
4. నిత్యం అలసిపోయిన ఫీలింగ్ తోనే ఉంటారు. తిన్నా తినకపోయినా, పనిచేసినా, చేయకపోయినా అలసట మాత్రం మిమ్మల్ని వీడనట్టు అనిపిస్తుంది. బలహీనంగా, బద్దకంగా అనిపిస్తుంది. 
5. ప్రీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నవారికి మోచేతులు, మెడ, మోకాళ్లు, చంకల దగ్గర చర్మం నల్లగా మారుతుంది. దీన్ని చాలా మంది తేలికగా తీసుకుంటారు. అలా తీసుకూడదు. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: ఇతడు గజినీల సంఘానికే లీడర్... ఆరుగంటలకోసారి అంతా మర్చిపోతాడు, చివరికి కొడుకు పుట్టిన సంగతి కూడా...


Also read:  భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?


Also read:  తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?






Also read: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి