వారసత్వంగా వచ్చిన ఆస్తులను సైతం  దేశ స్వాతంత్ర్యం కోసం దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వదులుకున్నారని, పదేళ్ల పాటు జైలు జీవితం సైతం గడిపారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. అలాంటి నేత అయిన దేశ తొలి ప్రధాని నెహ్రూ జన్మదినం దేశ ప్రజలకు పండుగ అన్నారు. దేశ స్వాతంత్య్రంతో సంబంధం లేనివారిని, మతాలతో రెచ్చగొట్టే వారిని నేడు దేశ భక్తులుగా చూపిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తోడు దొంగలేనని, నేటి యువతకు తప్పుడు చరిత్రను చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ ధర్నాలకు అనుమతులు వస్తాయని.. కానీ కాంగ్రెస్ పార్టీ నేతల ధర్నాలకు అనుమతులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తాము ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదని కేవలం వాయిదా వేశామని స్పష్టం చేశారు. ఆఖరికి కలెక్టర్ లు సైతం రాజకీయ నాయకులుగా వ్యవహరిస్తున్నారని.. నిబంధనలు కాంగ్రెస్ నేతలకేనా.. టీఆర్ఎస్, బీజేపీ నేతలకు ఉండవా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read: పిల్లలకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్, ఈ ఒక్కరోజు మాత్రమే.. సజ్జనార్ ట్వీట్


ఎలక్షన్ కమిషనర్ ముందు నిరసన..
‘వడ్లు కొననందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఓటు వేయాలి. రైతుల నుంచి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర (బీజేపీ), రాష్ట్ర (టీఆర్ఎస్) ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. ఒక పది వేల కోట్లు వడ్లు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించలేదా?. ప్రత్యేక బడ్జెట్ పెట్టి ప్రతీ ధాన్యం గింజ ప్రభుత్వాలు కొనాల్సిందే. ఢిల్లీ జంతర్ మంతర్ లో ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఎందుకు దీక్ష చేయడు. బీజేపీ, టీఆర్ఎస్‌కు ఇచ్చే అనుమతులు, కాంగ్రెస్ పార్టీ ధర్నాలకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముందు కాంగ్రెస్ నేతలం నిరసన తెలుపుతామని రేవంత్ రెడ్డి తెలిపారు.ః


సీఏల్పీ నేత భట్టి విక్రమార్క.. 
నెహ్రూ వేసిన పునాదులే ఈ దేశం ఇంత బలంగా నిర్మాణం అవ్వడానికి కారణం మని భట్టి విక్రమార్క అన్నారు. దేశాన్ని ప్రేమించే ప్రతీ ఓక్కరు నెహ్రూకు నివాళులు అర్పించాలి. కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం స్వాతంత్య్రోద్యమంతో ఎలాంటి సంబంధం లేని వారిని స్వాతంత్ర్య సమరయోధులుగా చెబుతున్నారు. అలాంటి వారిని దేశ ద్రోహులుగా పరిగణించాలి. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా అమ్మేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉంది. హుజూరాబాద్ ఫలితంపై రివ్యూ చాలా అర్దవంతంగా జరిగింది. హుజూరాబాద్ సమీక్షపై వచ్చిన ఏ వార్త కూడా నిజం కాదు. సమావేశం అనంతరం అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు భట్టి విక్రమార్క.
Also Read: గళమెత్తాల్సిన సమావేశాలకు గైర్హాజర్ ! కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నారా ? తెలంగాణ ప్రయోజనాల కోసమా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి