పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా 'భీమ్లా నాయక్'. ఇందులో రానా దగ్గుబాటి మరో హీరో. ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ మరోసారి స్పష్టం చేసింది. సంక్రాంతి బరిలో 'భీమ్లా నాయక్'తో పాటు మరికొన్ని భారీ సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. వాటిలో ఓ సినిమా వెనక్కి వెళ్లింది. 'భీమ్లా నాయక్' కూడా వెనక్కి వెళుతుందనే మాటలు వినిపించాయి. అయితే... ఈ రోజు నిర్మాతలు చేసిన ప్రకటనతో సంక్రాంతి బరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని, అందులో ఎటువంటి మార్పు లేదనే క్లారిటీ వచ్చింది.
పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్తా మీనన్ కనిపించనున్న ఈ సినిమా మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్'కు రీమేక్. అయితే... తెలుగు ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టు కథలో మార్పులు చేశారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణల అందించడంతో పాటు ఓ పాట కూడా రాశారు. సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
'వకీల్ సాబ్' తర్వాత మరోసారి పవన్ కల్యాణ్ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న సినిమా ఇది. ఆల్రెడీ రిలీజైన పాటలకు రెస్పాన్స్ బావుంది. రీ రికార్డింగ్ పనులు కూడా ప్రారంభించారు. ఈ రోజు (మంగళవారం) తమన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయనకు 'భీమ్లా నాయక్' బృందం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.
Also Read: లాయర్లతో రవితేజ మంతనాలు... సెక్షన్ల గురించి ఆరా తీస్తున్న మాస్ మహారాజ్
Also Read: అనుష్క స్లిమ్ గా ఎలా మారిందో తెలుసా..? ఇదిగో ఆమె డైట్ సీక్రెట్..
Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి కథియవాడి'
Also Read: సన్నీ & కో ని టార్గెట్ చేశారా... బిగ్ బాస్ హౌస్ లో పదకొండోవారం నామినేషన్ల హీట్
Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి