సాధారణంగా టాలీవుడ్ లో డిసెంబర్ నెలలో పెద్దగా సినిమాలను రిలీజ్ చేయరు. చాలా మందికి ఆ నెల కలిసి రాదని ఫీలింగ్. క్రిస్మస్ కి మహా అయితే ఒకట్రెండు సినిమాలు వస్తుండేవి తప్ప.. పెద్ద సినిమాలేవీ కూడా రిలీజ్ అయ్యేవి కాదు. కానీ పాండమిక్ తరువాత డిసెంబర్ లో సినిమాలను రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఏడాది డిసెంబర్ లో అయితే గ్యాప్ లేకుండా ఒకదాని తరువాత మరొక సినిమా రాబోతుంది.


Also Read:  కోటి నెగ్గిన రాజా రవీంద్ర చాలా స్పీడ్ గురూ.. ఆయనను హాట్ సీటుకు తీసుకెళ్లిన ప్రశ్న ఏంటంటే! 


ముందుగా నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ సినిమాలో బాలయ్య రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నారు. అందులో ఒకటి అఘోరా గెటప్. ఇప్పటికే ఈ పాత్రపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ట్రైలర్ చూసిన అభిమానులు ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నారు. 


ఈ సినిమా వచ్చిన వారానికి డిసెంబర్ 10న కీర్తి సురేష్ నటించిన 'గుడ్ లక్ సఖీ' విడుదల కానుంది. పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై సరైన బజ్ క్రియేట్ చేయలేకపోయారు. కీర్తి సురేష్ ఒక్కటే సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా తరువాత ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. సమంత స్పెషల్ సాంగ్ చేస్తోంది. 


ఈ సినిమాలతో పాటు నేచురల్ స్టార్ నాని కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దానికి తగ్గట్లుగా ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మెగాహీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న 'గని' సినిమాను కూడా డిసెంబర్ 24న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. 'గని' సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పోస్ట్ పోన్ అయినా కూడా డిసెంబర్ 31కి వచ్చేస్తుంది. మొత్తానికి ఈ ఏడాది డిసెంబర్ టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.  


Also Read: పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లడం లేదు... సంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయక్'


Also Read: కోటి రూపాయలు గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలంగాణ పోలీస్


Also Read: డిసెంబ‌ర్‌లో కీర్తీ సురేష్ డ‌బుల్ ధ‌మాకా... ఇటు గురి, అటు హిస్టరీ!


Also Read: లాయర్లతో రవితేజ మంతనాలు... సెక్షన్ల గురించి ఆరా తీస్తున్న మాస్ మహారాజ్


Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి  కథియవాడి'


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి