రాబోయే కాలమంతా ఎలక్ట్రిక్ వాహనాలదే! అందుకే కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీపై దృష్టిపెట్టాయి. ఇప్పటికే ఓలా రిజిస్ట్రేషన్లకు విపరీతమైన స్పందన లభించింది. తాజాగా హీరో మోటోకార్ప్ తన మొదటి ఎలక్ట్రానిక్ వాహనాన్ని ఏపీలోని చిత్తూరు యూనిట్‌లో తయారు చేస్తామని ప్రకటించింది. 2022, మార్చిలో విడుదల చేయనుంది.
తమ ఎలక్ట్రికల్ వెహికల్ (EV) ప్రాజెక్టు అడ్వాన్సుడ్ దశలో ఉందని హీరో మోటోకార్ప్ తెలిపింది. 'గార్డెన్ ఫ్యాక్టరీ'గా పిలుచుకొనే చిత్తూరులోని ప్లాంట్‌లో పర్యావరణ హితంగా, మంచి తయారీ పద్ధతుల్లో ఈవీని రూపొందిస్తామని వెల్లడించింది. బ్యాటరీ ప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్, వెహికిల్ అసెంబ్లీ, వెహికిల్ ఎండ్ ఆఫ్ లైన్ టెస్టింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తామంది.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని వినియోగదారుల రవాణా సమస్యలకు పరిష్కారాలు చూపిస్తామని హీరో మోటోకార్ప్ తెలిపింది. ప్రొడక్ట్ పోర్ట్‌పోలియోలో ఈవీలను భాగం చేస్తామంది. ఇప్పటికైతే ఈ ఎలక్ట్రికల్ వెహికిల్ వివరాలైతే తెలియదు. అయితే 2021, ఆగస్టులో సంస్థ ఛైర్మన్ డాక్టర్ పవన్ ముంజాల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని వివరాలు చెప్పడం గమనార్హం.
హీరో మోటోకార్ప్ తయారు చేస్తున్న మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైనింగ్, డెవలప్‌మెంట్ అంతా జైపుర్‌లోని ఆర్ అండ్ డీ కేంద్రంలో జరుగుతుంది. మ్యానుఫ్యార్చరింగ్ మాత్రం చిత్తూరులో జరుగుతుంది. ఎథెర్ 450X, ఓలా ఎస్1 ప్రొ, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్‌కు పోటీగా హీరో ఈవీ రానుంది.
Also Read: PM Modi Crypto Meeting: క్రిప్టో కరెన్సీపై మోదీ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం!
Also Read: Financial Lessons for Kids: మీ పిల్లలకు ఈ 6 'డబ్బు' పాఠాలు నేర్పండి!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?