ఐటీ కంపెనీ మాస్‌టెక్ మదుపర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. కేవలం 18 నెలల్లోనే ఈ కంపెనీ షేరు 1500 శాతం ర్యాలీ చేసింది. రూ.172 నుంచి శుక్రవారానికి రూ.2,871కి చేరుకుంది. అంటే ఏడాదిన్నర క్రితం ఇందులో రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ.16.65 లక్షలు చేతికి అందేవి. ఇదే సమయంలో సెన్సెక్స్ 102 శాతమే పెరగడం గమనార్హం.
ఈ మిడ్‌క్యాప్ షేరు శుక్రవారం రూ.2,871 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 100, 200, రోజుల మూవింగ్ యావరేజెస్ పైన కొనసాగుతోంది. అయితే 5, 20, 50 రోజులు మూవింగ్ యావరేజెస్ కింద ఉంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.8,375 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది ఆరంభం నుంచి 148 శాతం పెరిగిన షేరు ఏడాదిలో 217 శాతం వృద్ధి నమోదు చేసింది.
మాస్‌టెక్ 2021, అక్టోబర్ 19న 3,666 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. క్యూ2లో ఫలితాలు సాధారణంగా ఉండటంతో తర్వాతి సెషన్‌లోనే 15 శాతం నష్టపోయింది. 4 శాతం వృద్ధితో ఈ కంపెనీ రెండో త్రైమాసికంలో 72.29 కోట్ల ఏకీకృత లాభం నమోదు చేసింది. అంతకు ముందు ఇది రూ.69.30 కోట్లుగా ఉండటం గమనార్హం. అమ్మకాలు 3.38 శాతం పెరిగి రూ.533 కోట్లుగా ఉన్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ సహా కొన్ని బ్రోకరేజ్ సంస్థలు మాస్‌టెక్ షేరు ధరపై బుల్లిష్‌గా ఉన్నాయి. ప్రస్తుత ధర నుంచి రూ.3,300కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి. యూరప్, యూకేలో ఆర్డర్లు రానున్నాయని అంటున్నాయి. ఈ కంపెనీలో ప్రమోటర్లకు 37 శాతం, పబ్లిక్ షేర్ హోల్డర్లకు 62.25 శాతం వాటాలు ఉన్నాయి.
Also Read: Credit Score: క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలియదా? ఇలా చేస్తే సులభంగా పెంచుకోవచ్చు..!
Also Read: Paytm IPO: పేటీఎం ఐపీవోతో కోటీశ్వరులు అవుతున్న 350+ ఉద్యోగులు.. సంతోషంలో ఉబ్బితబ్బిబ్బు!
Also Read: Business Idea: ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? ఈ పనిచేయండి.. నెలకు రూ.2 లక్షలు మీ సొంతం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి