ఫిన్‌టెక్ కంపెనీ మొబిక్విక్ మరో కొత్త డిజిటల్ కార్డును ఆవిష్కరించింది. యాక్సిస్ బ్యాంక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆప్ ఇండియా (NCPI)తో కలిసి మొబిక్విక్ రూపేకార్డును విడుదల చేసింది. దేశంలో డిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సేవలను ఆరంభించింది. వినియోగదారులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు ఈ కార్డుతో ఉచితంగానే చెల్లింపులు చేయొచ్చని వెల్లడించింది.
రూ.2 లక్షల వరకు మొబిక్విక్ వ్యాలెట్ బాలెన్స్ ఇప్పుడు మొబిక్విక్ రూపే ప్రీపెయిడ్ కార్డుతో వాడుకోవచ్చు. మొబిక్విక్ మర్చంట్ నెట్‌వర్కే కాకుండా 190 దేశాలు, 4.1 కోట్ల మర్చంట్స్ వద్ద దీనిని ఉపయోగించుకోవచ్చు. ఈ కార్డు యూజర్లు నేరుగా మొబిక్విక్ జిప్‌కు అర్హులు అవుతారు. ఇదో బీఎన్‌పీఎల్ ప్రొడక్ట్. అంటే ఇప్పుడు కొని తర్వాత చెల్లించొచ్చు. యూజర్ వాలెట్‌లో రూ.30వేల వరకు క్రెడిట్ ఉంటుంది. ప్రతి లావాదేవీపై రూపే కార్డు, మొబిక్విక్ సూపర్‌క్యాష్ ద్వారా రెండురకాల ఆఫర్లను పొందవచ్చు.
మొబిక్విక్ రూపే కార్డు ప్రత్యేకతలు
- యాక్టివేషన్ ఫీజులు లేవు
- హోమ్ సెంటర్‌పై 50 శాతం, ఉబెర్ బుకింగ్స్‌పై 30 శాతం వరకు రాయితీ
- రూ. 2 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా (మరణించినా, పూర్తిగా అంగవైకల్యం వచ్చినా)
- కార్డు కొనుగోళ్లపై మొబిక్విక్ సూపర్‌క్యాష్
ఇవే కాకుండా టోకెనైజేషన్, ఆఫ్‌లైన్ ట్రాన్సిట్, ప్రయాణాలు, డైనింగ్, రిటైల్ షాపింగ్, బిల్లుల చెల్లింపులపై రూపే ఆఫర్లు అందిస్తోంది. బహుమతులు లేదా పూల బొకేల డెలివరీ, రెస్టారెంట్ రిఫరల్, ఐటీ రిటర్నుల దాఖలు చేయడంలో 24x7 సహాయం తీసుకోవచ్చు.
Also Read: Credit Score: క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలియదా? ఇలా చేస్తే సులభంగా పెంచుకోవచ్చు..!
Also Read: Paytm IPO: పేటీఎం ఐపీవోతో కోటీశ్వరులు అవుతున్న 350+ ఉద్యోగులు.. సంతోషంలో ఉబ్బితబ్బిబ్బు!
Also Read: Business Idea: ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? ఈ పనిచేయండి.. నెలకు రూ.2 లక్షలు మీ సొంతం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి