క్రిప్టో కరెన్సీపై శనివారం జరిగిన అత్యున్నత సమావేశానికి ప్రధాన నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు. నియంత్రణలో లేని ఈ విపణి అక్రమ నగదు బదిలీ, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక దన్నుగా మారకుండా అడ్డుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలను ట్రేడ్ చేస్తుండటంతో మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలన్నారు. ఆర్‌బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారని పీటీఐ తెలిపింది.
యువతను తప్పుదారి పట్టించేలా అసత్య హామీలు ఇవ్వడం, పారదర్శకత లేని ప్రకటనలను అడ్డుకోవడంపై సమావేశంలో చర్చించారని తెలిసింది. క్రిప్టో కరెన్సీలపై కఠిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారని సమాచారం.
'ప్రపంచ వ్యాప్తంగా ఈ సాంకేతికత దూసుకుపోతుందని ప్రభుత్వానికి తెలుసు. క్రిప్టో కరెన్సీలను ప్రభుత్వం కూలంకషంగా పరిశీలిస్తోంది. అవసరమైన చర్యలు తీసుకోనుంది. క్రిప్టో ట్రేడింగ్‌కు ఊతం ఇచ్చేలా, ప్రగతిశీలంగా ప్రభుత్వ చర్యలు ఉండాలన్న ఆలోచనను అందరూ స్వాగతించారు' అని పీటీఐ తెలిపింది.
క్రిప్టో కరెన్సీ నిపుణులు, స్టేక్ హోల్డర్లతో ప్రభుత్వం చురుగ్గా చర్చలు జరపనుందని తెలుస్తోంది. దేశాలతో సంబంధం లేకుండా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ జరుగుతుండటంతో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని, సమన్వయంతో వ్యూహాలు రచించాలని ప్రభుత్వం కోరుకుంటోంది.
ఆర్‌బీఐ, ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలతో ఈ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ప్రపంచంలోని ఇతర దేశాలు, అనుభవజ్ఞులు, నిపుణులతో ఇప్పటికే సంప్రదించారని, వారిచ్చిన సమాచారం ఆధారంగానే సమావేశం నిర్వహించారని తెలిసింది. అలాగే అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్‌ను పరిశీలించారని పీటీఐ తెలిపింది. కాగా క్రిప్టో కరెన్సీలు ఏ ఆర్థిక వ్యవస్థకైనా ప్రమాదకరమేనని ఇప్పటికే ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Also Read: MobiKwik RuPay Card: మొబిక్విక్ రూపే కార్డు.. ముందే రూ.30వేలు వాడేసుకోవచ్చు..! మరెన్నో ఆఫర్లు..!
Also Read: Honda New SUV: హోండా కొత్త ఎస్‌యూవీలు త్వరలో.. ఈ విభాగంలో బెస్ట్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి