Evaru Meelo Kotteswarulu: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన పేరు రాజా రవీంద్ర. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'లో పాల్గొన్న సీఐడీ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకుని సత్తా చాటారు. కోటి రూపాయలు గెలుచుకున్న తొలి వ్యక్తిగా భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఈ పోలీస్ నిలిచారు.  'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమం ఇప్పుడు జెమినీ టీవీలో ప్రసారం అవుతోంది. 

హిందీలో ప్రసారమయ్యే కౌన్ బనేగా కరోడ్‌పతి షో తరహాలో తెలుగులో ’మా టీవీ’లో మీలో ఎవరు కోటీశ్వరులు అనే షో కొన్ని సీజన్లు నిర్వహించారు. అందులో ఏ ఒక్కరూ కోటి రూపాయలు గెలుచుకోలేదు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరులులో పాల్గొన్న తెలంగాణకు చెందిన ఎస్ఐ కోటి రూపాయల ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి విజేతగా అవతరించారు. ఇందుకు సంబంధించిన ప్రశ్న జెమినీ టీవీలో నేటి రాత్రి 8:30 గంటలకు ప్రసారం కానుంది. అయితే సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో తన ఆలోచనలు, తెలివితేటలతో షోలో హోస్ట్ ఎన్టీఆర్‌ను కంటెస్టెంట్ రాజా రవీంద్ర ఆశ్చర్యపరిచారు. Also Read: Raja Ravindra EMK Show: హోస్ట్ ఎన్టీఆర్‌కు షాకిచ్చిన కోటి రూపాయల విజేత రాజా రవీంద్ర.. అసలేం జరిగిందంటే!

రాజా రవీంద్రను హాట్ సీట్ కి తీసుకెళ్లిన ప్రశ్న ఏంటో తెలుసా.. హైదరాబాద్ నుంచి వాటి దూరాల ప్రకారం, ఈ నగరాలను తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి? A. న్యూయార్క్  B.ముంబయి  C. దుబాయ్  D. విజయవాడఇది చదివి సమాధానం మాకు తెలుసని చాలా మంది అనుకుంటారు. కానీ సమాధానం చెప్పడం ముఖ్యం కాదు ఇక్కడ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్‌కు ప్రాధాన్యం. తక్కువ సమయంలో సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఐ రాజా రవీంద్ర కేవలం 2.637 సెకన్లలోనే ఇతర కంటెస్టెంట్స్ కంటే ముందుగా సమాధానం ఇచ్చి హాట్ సీటుకు వెళ్లారు. ఈ వారం హాట్ సీట్‌కు వెళ్లిన తొలి కంటెస్టెంట్ సైతం ఆయనే. ఆయన తరువాత ఓ కంటెస్టెంట్ 3.7 సెకన్లలో సమాధానం చెప్పగా.. ఇతరులు 5 నుంచి 7 సెకన్లలో ఆన్సర్ క్లిక్ చేశారు. రాజా రవీంద్ర చెప్పిన  సమాధానం D,B,C,A (DBCA)Also Read: పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లడం లేదు... సంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయక్'

గతంలో జరిగిన మీలో ఎవరు కోటీశ్వరులు, ప్రస్తుతం జరుగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు ఓవరాల్‌గా చూస్తే అత్యంత వేగంగా వచ్చిన సమాధానాలలో రాజా రవీంద్ర ఆన్సర్ సైతం ఒకటని చెప్పవచ్చు. ఇటుక మీద పేర్చి ఇల్లు కట్టినట్లుగా రాజా రవీంద్ర ప్రశ్నలకు బదులిస్తూ హోస్ట్ ఎన్టీఆర్‌ను సైతం ఆకట్టుకున్నారు. సోమవారం ప్రసారమైన ప్రోగ్రాంలో ఆయన 12 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అంటే నిన్నటి షో ముగిసేసరికి రాజా రవీంద్ర గెలుచుకున్న మొత్తం రూ.12,50,000. కోటి రూపాయలకు ఆయన మరో మూడు ప్రశ్నల దూరంలో ఉన్నారు.Also Read: కోటి రూపాయలు గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలంగాణ పోలీస్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి