వన్‌ప్లస్ నార్డ్ 2 x ప్యాక్‌మ్యాన్ ఎడిషన్ అధికారికంగా మనదేశంలో లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ 2 తరహాలోనే దీని ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే దీని డిజైన్‌లో కాస్త మార్పులు చేశారు. ఒకప్పుడు ఎంతో గుర్తింపు పొందిన ఐకానిక్ గేమ్ ప్యాక్‌మ్యాన్‌ను ప్రతిబింబిచేలా దీని డిజైన్ ఉంది. ఈ ఫోన్ బాక్స్‌లో కూడా ప్యాక్ మాన్ గేమర్స్‌కు నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇచ్చే కొన్ని వస్తువులను అందించారు.


వన్‌ప్లస్ నార్డ్ 2 x ప్యాక్‌మ్యాన్ ఎడిషన్ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీని ధర రూ.37,999గా ఉంది. అమెజాన్ వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్లలో దీనికి సంబంధించిన సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది.


గతంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ 2లో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.34,999గా నిర్ణయించారు. ఇందులో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గానూ ఉంది.


వన్‌ప్లస్ నార్డ్ 2 x ప్యాక్‌మ్యాన్ ఎడిషన్
ఇందులో 6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీన్ని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9 శాతంగానూ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఏఐ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు.


ఇందులో 4500 ఎంఏహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీని అందించారు. వార్ప్ చార్జ్ 65 టెక్నాలజీని కూడా ఇది సపోర్ట్ చేయనుంది. కేవలం 30 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ కానుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో ప్యాక్‌మాన్ 256 గేమ్‌ను ప్రీ-ఇన్‌స్టాల్ చేశారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను అందించగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 కెమెరాను అందించారు. ఇది 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


టైమ్ ల్యాప్స్, వీడియో ఎడిటర్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. నైట్‌స్కేప్ అల్ట్రా, ఏఐ ఫొటో ఎన్‌హేన్స్‌మెంట్, అల్ట్రాషాట్ హెచ్‌డీఆర్, పొర్‌ట్రెయిట్ మోడ్, డ్యూయల్ వీడియో, ప్రో మోడ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీ కెమెరాలో ఈఐఎస్ ఫీచర్‌ను అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, జీపీఎస్/ఏ-జీపీఎస్/నావిక్, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.82 సెంటీమీటర్లుగానూ, బరువు 189 గ్రాములుగానూ ఉంది.


Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి