ABP Desam Exclusive: కోటి గెలుచుకున్న Raja Ravindra చెప్పిన ఆసక్తికర విషయాలు
Continues below advertisement
జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమంలో పాల్గొని కోటి రూపాయలు నెగ్గిన తొలి వ్యక్తిగా భాస్కర రాజా రవీంద్ర నిలిచారు. ఖమ్మం జిల్లా సుజాతనగర్ ప్రాంతానికి చెందిన విశ్రాంత గ్రామీణ వికాస బ్యాంకు ఉద్యోగి శ్రీ బి. వి ఎస్ ఎస్ రాజు మరియు శేషుకుమారి దంపతుల కుమారుడు రాజా రవీంద్ర. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే రవీంద్ర 1989 నుంచి 1997 వరకు ప్రాథమిక విద్యను వైరాలోని మధు విద్యాలయంలో పూర్తి చేశారు.
1999 to 2003 వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కాలేజీ లో బీటెక్ పూర్తిచేసారు. ఆయన కు భార్య సింధుజ, కుమారుడు దేవాన్ష్ కార్తికేయ, కూతురు కృతి అన్విక వున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో పాల్గొన్న రాజా రవీంద్ర మంగళవారం నాడు కోటి రూపాయల ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి విజేతగా నిలిచారు.
Continues below advertisement