కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ప్రజలు తిరస్కరించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. సర్పంచ్, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని అక్కడి ప్రజలు తిరస్కరించారన్నారు. ఈ ఓటమిని అంగీకరించి చంద్రబాబు రాజకీయాల నుంచి వైదొలిగితే సంతోషిస్తామని ఆయన ప్రకటించారు. చంద్రబాబుకు 72 సంవత్సరాల వయసు వచ్చిందని..  ఆయన హైదరాబాద్‌కే పరిమితం అయి.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ఇప్పటికి రాజకీయాల్లో కొనసాగాలని అనుకుంటే.. తమను కానీ .. తమ సీఎం జగన్‌ను కానీ వ్యక్తిగతంగా దుర్భాషలు ఆడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.





 


Also Read : గవర్నర్ బిశ్వభూషణ్‌కు అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు !


కుప్పంలో ఓడిపోయినా టీడీపీ నేతలు దొంగ ఓట్లని.. మరోకటని ప్రచారం చేస్తారని కానీ వారే కోర్టుకు వెళ్లి అన్ని ఆదేశాలు తెచ్చుకున్నారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. పోలింగ్ రోజున ఏం జరిగిందో తనకు తెలియదని.. తాను అక్కడ లేనన్నారు. దొంగ ఓట్లు వేశారని ఎక్కడా ఫిర్యాదులు రాలేదని ఎన్నికల సంఘం చెప్పిన విషయాన్ని పెద్దిరెడ్డి మీడియా ప్రతినిధులకు తెలిపారు. 


Also Read : ఓ ప్రజాప్రతినిధి నిర్వాకం... కుమార్తె పెళ్లికి కానుకలు సమర్పించాలని హుకూం... వైరల్ అవుతున్న వీడియో..!


వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ కష్టపడి సీఎం అయి.. ఆయన కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని కానీ లోకేష్ ఎమ్మెల్యేగానే గెలవలేకపోయారన్నారు. ఇక నుంచి మా గురించి చంద్రబాబు కానీ, లోకేష్ కానీ టీడీపీ నేతలు కానీ చెడు మాటలు మాట్లాడితే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు.  చంద్రబాబు నాయుడు పుంగనూరుకు వచ్చి పోటీ చేయాలని సవాల్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఏదేదో చెబుతామని గెలిచిన వారే నాయకులని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.


Also Read : ఓ ప్రజాప్రతినిధి నిర్వాకం... కుమార్తె పెళ్లికి కానుకలు సమర్పించాలని హుకూం... వైరల్ అవుతున్న వీడియో..!


కుప్పం నియోజకవర్గానికి ఎన్నికల బాధ్యతను సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. ఎన్నికల ఇంచార్జ్‌గా పెద్దిరెడ్డి కుప్పంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పార్టీ శ్రేణులందర్నీ కూడగట్టి విజయం సాధించారు.  చంద్రబాబు సుదీర్ఘంగా గెలుస్తున్న నియోజకవర్గంలో టీడీపీకి చెక్ పెట్టారు. 


Also Read: తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి