ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా ఎన్నికల్లో బయటపడిందని తెలుగుదేశం పార్టీ అభిప్రాయపడింది. గత స్థానిక  సంస్థల ఎన్నికల సమయంలో 30 శాతంగా ఉన్న తమ ఓటు బ్యాంక్ 45 శాతానికి పెరిగిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ప్రజాభిమానం ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని నమ్మితే తక్షణం ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ గెలిస్తే తెలుగుదేశం పార్టీని మూసేస్తామని ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల ఫలితాలపై మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. 


Also Read : వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ అదుపులో శివశంకర్ రెడ్డి


ప్రభుత్వం అన్ని రకాల వ్యవస్థలను ఉపయోగించుకుని ఎన్ని నిర్బంధాలు అమలు చేసినా.. వందల కోట్లు  ఖర్చు పెట్టినా పలు చోట్ల తాము గెలిచామని అచ్చెన్నాయుడు తెలిపారు. దర్శిలో విజయం సాధించామని పల్నాడులో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయకుండా వేధించినా... అక్కడా మంచి పనితీరు కనబరిచామన్నారు. ఇది ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు స్పష్టమైన సూచన అని స్పష్టం చేశారు. బుగ్గన స్వగ్రామం బేతంచర్లలో టీడీపీ ఆరు వార్డుల్ని గెల్చుకుందని..  బుగ్గన నివాసం ఉంటున్న వార్డులోనూ టీడీపీ గెలిచిందన్నారు. 


Also Read : ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ? ఏపీ బీజేపీ నేతలకు చివరి చాన్స్ !?


కుప్పంలో జరిగిన ఎన్నికలు అసలు ఎన్నికలే కాదని స్పష్టం చేశారు. వందల మంది దొంగ ఓటర్లు, వ్యవస్థల్ని ఉపయోగించుకుని.. టీడీపీ నేతల్ని అరెస్ట్ చేసి పోలింగ్ నిర్వహించుకున్నారని ఇలా ఎన్నికలు నిర్వహించి తామే గెలిచామని చెప్పుకోవడం సిగ్గు అని ఎర్రన్నాయుడు మండిపడ్డారు. ప్రజలు అధికార పార్టీ అరాచకాలను చూసి నవ్వుతున్నారని విమర్శించారు. ఇలాంటి గెలుపులే నిజమైతే ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు.


Also Read : నెల్లూరులో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్..కనీస పోటీ ఇవ్వలేకపోయిన టీడీపీ !


తమ వైపు తప్పులుంటే విశ్లేషణ చేసుకుని సరిదిద్దుకుంటామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలను చూసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం విషయం చేస్తున్న ప్రచారాన్ని చూసి అధైర్యపడవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నందున ఇక ముందు ముందు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. 


Also Read : కుప్పం ఓటమిని అంగీకరించి రాజకీయాల నుంచి వైదొలగాలి .. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సూచన!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి