మొసలిని చూస్తేనే సగం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఎందుకంటే.. పారల్లాంటి దాని నోటికి చిక్కినట్లయితే నామ రూపాలు లేకుండా శరీరాన్ని ఛిద్రం చేస్తుంది. మనల్ని ఆహారం చేసుకుంటుంది. అందుకే, దాని వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయరు. అయితే, కాలిఫోర్నియాకు చెందిన ఆ మహిళ మాత్రం మొసలికి ఏ మాత్రం భయపడదు. పైగా.. దాన్ని బాయ్‌ఫ్రెండ్‌ను హత్తకున్నంత ప్రేమగా కౌగిలించుకుంటుంది. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, ఈ వీడియో చూడండి. 


కాలిఫోర్నియాలోని ఓ జూలో కేర్ టేకర్‌గా పనిచేస్తున్న మహిళ.. డార్త్ గ్యాటర్ అనే ఓ మొసలితో స్నేహం చేస్తోంది. జీవితాంతం అదే తన బెస్ట్ ఫ్రెండ్ అని కూడా ఆమె ప్రకటించేసింది. ఆమె చెప్పినట్లుగానే.. ఆ మొసలికి, గ్యాటర్‌కు మధ్య మంచి స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాటర్ వెల్లకిలా పడుకుంటే.. మొసలి ఆమె మీదకు ఎక్కి హత్తుకుంటోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. 


Also Read: డేరింగ్ లేడీ.. మొసలిని చెప్పుతో తరిమి కొట్టిన మహిళ.. నెటిజన్స్ షాక్!


గ్యాటర్ ఓ మొసలిని గట్టిగా హత్తుకుంది. అయితే, అది ఆమె మీదకు ఎక్కి మూత్రం పోసింది. లక్కీగా ఆ మూత్రం ఆమె దుస్తులకు అంటుకోలేదు. ఈ మొసలి గురించి కేర్ టేకర్ మాట్లాడుతూ.. ‘‘ఒక్కోసారి నేను గ్యాటర్‌ను కౌగిలించుకుంటాను. అది మా మొసళ్ల రాయబారి. అయితే, దీన్ని నేను పెంచుకోవడం కుదరదు. ఎందుకంటే అటవీ జంతువులను పెంచుకోవడం కాలిఫోర్నియాలో నిషేదం’’ అని తెలిపింది. ఈ వీడియోను చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. మొసలి దగ్గరకు వెళ్లి నిలుచోవడమే పెద్ద సాహసం. అలాంటిది ఆమె ఏకంగా హత్తుకుంటోందని.. ఇందుకు ధైర్యం ఉండాలని అంటున్నారు. 


వీడియో: 






Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి