రాజ్ తరుణ్ - కాశిష్ ఖాన్ హీరోహీరోయిన్లుగా నటించిన ''అనుభవించు రాజా'' సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ కి మంచి స్పందన వచ్చింది. సినిమా విడుదల దగ్గరపడడంతో ప్రమోషన్ జోరు పెంచిన మేకర్స్ అక్కినేని నాగార్జున చేతులమీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. 






 'రూపాయి పాపాయి లాంటిదిరా.. దాన్ని పెంచి పెద్దది చేసుకోవాలిగానీ ఎవడి చేతుల్లో పడితే వాడి చేతుల్లో పెట్టకూడదు' అనే డైలాగ్ తో ప్రారంభమైంది. 'బంగారం గాడి మనసు సినిమా హాల్ లాంటిది.. వారానికో సినిమా వస్తుంటది.. పోతుంటది. ఏదీ పర్మెనెంట్ గా ఆడదిక్కడ' అనే డైలాగ్ హీరో క్యారెక్టరైజేషన్ చెబుతోంది. 'వచ్చే సంవత్సరం ఇదే రోజు ఇక్కడే జెండా ఎగరేస్తా.. బంగారంగా కాదు.. ప్రెసెడెంట్ బంగారంగా' అనే డైలాగ్ రాజ్ తరుణ్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.  



నటనపరంగా ఇప్పటివరకూ మైనస్ మార్కులు లేకపోయినా ఈ మధ్యకాలంలో ఆశించిన స్థాయిలో రాజ్ తరుణ్ కు హిట్ దక్కడం లేదు. ఈ సినిమాతో ఆ లోటు తీరిపోతుందనే విశ్వాసంతో ఉన్నాడు.అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోపీ సుందర్ సంగీత దర్శకుడు.





Also Read: అమ్మలక్కలా మారిపోయిన రవి, బిగ్ బాస్ హౌజ్ లో విమెన్ ట్రాఫెకింగ్... మాధవీ లత షాకింగ్ కామెంట్స్
Also Read:  పునీత్‌కు అరుదైన గౌరవం.. 'కర్ణాటకరత్న' అవార్డుతో సత్కారం..
Also Read: సెల్యూట్ టు సూర్య.. కామ్రేడ్ బాలకృష్ణన్ చేతుల మీదుగా పార్వతికి రూ.15 లక్షల చెక్..
Also Read: సిరితో ఎమోషనల్ కనెక్షన్.. భయపడుతోన్న షణ్ముఖ్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి