సిరి-షణ్ముఖ్ నామినేషన్ ప్రాసెస్ లో ప్రవర్తించిన తీరుని గుర్తుచేసుకొని కాజల్ ఏడ్చేసింది. దీంతో సన్నీ-రవి ఆమెని ఊరుకుబెట్టే ప్రయత్నం చేశారు. 

 

సిరి నామినేషన్ లో మానస్ పేరు తీసుకురావడంపై ప్రియాంక ఫైర్ అవుతూ సన్నీతో డిస్కషన్ పెట్టింది. ''ఇష్టం, కష్టం బయటకు వేరే విధంగా పోట్రె అవుతాయ్ కదా.. మానస్ హీరో అవ్వాలనుకుంటున్నాడు. అలాంటిది ఒక ట్రాన్స్ జెండర్ వచ్చి మానస్ ని ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది అంటే సెట్ అవ్వదు'' అంటూ చెప్పింది ప్రియాంక. 

 

బయట తమ రిలేషన్ ఎలా పోట్రె అవుతుందో తెలియడం లేదని.. కాబట్టి ఇద్దరం ఒక బెడ్ పై పడుకోవద్దని సిరికి చెప్పాడు షణ్ముఖ్. ఆ విషయానికి సిరి హర్ట్ అయినట్లు ఉంది. దీంతో షణ్ముఖ్ సారీ చెప్పడానికి ప్రయత్నించాడు. అయినా సిరి వినకపోవడంతో 'నా పాయింట్ నాకు కరెక్ట్ .. నిన్ను మర్చిపోతాను కూడా.. నాకు దూరంగా ఉండు' అని చెప్పాడు షణ్ముఖ్. 

 


 

మీ ఇల్లు బంగారం కానూ.. 

 

కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ కోసం హౌస్ మేట్స్ అందరూ గోల్డ్ మైనర్స్ గా మారాల్సి ఉంటుంది. వీలైనంత ఎక్కువ గోల్డ్ ను సేకరించాలి. ఫైనల్ గా ఎవరి దగ్గర ఎక్కువ గోల్డ్ ఉంటుందో వాళ్లు కెప్టెన్సీ టాస్క్ కోసం పోరాడతారని చెప్పారు. దీంతో హౌస్ మేట్స్ పోటీ పడుతూ టాస్క్ ఆడారు. కొందరేమో దొంగతనం చేశారు. 

 

షణ్ముఖ్-సిరి గొడవ.. 

 

బాత్రూమ్ లో కూర్చొని ఏడుస్తున్న షణ్ముఖ్ దగ్గరకు వెళ్లి సిరి.. 'నువ్వే మాటలంటావ్.. నువ్వే రియాక్ట్ అవుతావ్' అంటూ డైలాగ్ వేసింది. దానికి షణ్ముఖ్  నేను ఏడవడం వలన నువ్వేం తక్కువైపోవు.. నువ్ దానికే వచ్చినట్లు ఉన్నావ్ వెళ్లొచ్చు' అని సిరితో ఏడుస్తూ చెప్పాడు షణ్ముఖ్. 'ఇక్కడ నుంచి వెళ్లిపో' అని సిరితో అనగా.. ఆమె గట్టిగా మొహంమీద కొట్టుకుంది. 'నేనే మాట అన్నాను.. నాదే తప్పు.. నేనే తక్కువ అవుతాను.. నువ్వే పైకి వెళ్తావ్ వెళ్లు' అని సీరియస్ గా సిరితో అన్నాడు షణ్ముఖ్. సిరి ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తుంటే.. 'నీకోసం నువ్ గేమ్ ఆడుతున్నావ్ కదా.. వెళ్లి ఆడుకో.. నా దగ్గరకు రాకు' అని అన్నాడు.

 

ఏడుస్తున్న షణ్ముఖ్ చేతిని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది సిరి. 'నాకు దీపు చాలా గుర్తొస్తుంది. ఎందుకో నాకు చాలా లోన్లీగా ఉంది. తను(దీప్తి సునయన) ఉంటే కొంచెం బావుండేది నాకు. కింగ్ లా ఫీల్ అయ్యేవాడిని' అని అనగా.. 'ఇన్ని రోజులు ఆగావ్ కదా.. ఒక్క నాలుగు వారాలు ఆగు వెళ్లిపోదువు గానీ' అని చెప్పింది సిరి.

దానికి షణ్ముఖ్.. 'నాకు తెలుసు ఎప్పుడు వెళ్లాలో.. చెప్పాల్సిన అవసరం లేదు.. ప్లీజ్ ఇక్కడనుంచి వెళ్లిపోవా..? నాకు నువ్వొద్దు' అని డైలాగ్ వేశాడు. వెంటనే సిరి వాష్ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుంది. ఎంతసేపటికి ఆమె బయటకు రాకపోవడంతో షణ్ముఖ్ వెళ్లి డోర్ కొట్టాడు కానీ తీయలేదు సిరి. రవి వచ్చి డోర్ కొడుతూ అరవడంతో.. హౌస్ మేట్స్ అంతా టెన్షన్ పడుతూ బాత్రూం దగ్గరకు వచ్చారు. అప్పుడు డోర్ తీసిన సిరి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆ తరువాత షణ్ముఖ్ ఆమెని హగ్ చేసుకొని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. 


మానస్ కి పవర్ రూమ్ యాక్సెస్ రావడంతో బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చారు. పవర్ టూల్ ని సొంతం చేసుకోవాలంటే 25 గోల్డ్ కాయిన్స్ చెల్లించాలని.. అది మీరు చెల్లిస్తారా..? లేక ఎవరికైనా ఆఫర్ ఇస్తారా..? అని అడగ్గా.. మానస్.. సన్నీ పేరు చెప్పాడు. దీంతో సన్నీ పాతిక గోల్డ్ కాయిన్స్ చెల్లించి పవర్ టూల్ సొంతం చేసుకున్నాడు. 

 

షణ్ముఖ్.. శ్రీరామ్ తో డిస్కషన్ పెట్టాడు. సిరితో తన రిలేషన్ కారణంగా.. బయట తన పర్సనల్ లైఫ్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందనే టెన్షన్ ఉందని అన్నాడు. దాని శ్రీరామ్.. 'ఒక్కోసారి ఫ్రెండ్స్ విషయంలో కూడా పొసెసివ్ అయిపోతామని' అన్నాడు. సిరి వేరొకరితో రిలేషన్ లో ఉందని.. తను వేరొకరితో రిలేషన్ లో ఉన్నానని.. కానీ ఇక్కడ ఇద్దరం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నామని చెప్పాడు షణ్ముఖ్. 

 



 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి