దివంగత కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన మారణానంతరం ప్రభుత్వం ఆయన్ను 'కర్ణాటకరత్న' అవార్డుతో సత్కరించనుంది. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్ వేదికగా తెలిపారు. అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు పునీత్ రాజ్ కుమార్. ఆయన మరణవార్త సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌లో నిర్వహించారు.
Also Read:'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా..' ప్రోమో.. బన్నీ మాస్ స్టెప్స్..
నటుడిగానే కాకుండా సింగర్ గా కూడా పునీత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆరేళ్ల వయసు నుంచే ఆయన సినిమాల్లో పాటలు పాడడం మొదలుపెట్టారు. హీరో అయ్యాక కూడా సంగీతాన్ని విడిచిపెట్టలేదు. తన సినిమాల్లో పాడుకోవడంతో పాటు.. తన అన్నయ్య శివరాజ్ కుమార్ సినిమాలు, ఇతర హీరోల సినిమాల్లో కూడా పునీత్ పాటలు పాడారు. ఇప్పటివరకు దాదాపు వందకు పైగా పాటలు పాడిన ఆయనకు.. సింగర్ కూడా ఎన్నో అవార్డులు వచ్చాయి.
కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎన్నో అనాధశరణాలయాలను, వృద్దాశ్రమాలను కట్టించారు. వేల మంది పిల్లలకు ఉచిత విద్య అందించారు. అందుకే ప్రజలు ఆయన్ను దేవుడిలా కొలిచేవారు. సమాజం కోసం పునీత్ చేసిన సేవలను గుర్తించి 'కర్ణాటక రత్న', 'బసవ పురస్కార' అవార్డులు ఇవ్వాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి పునీత్ అభిమానులు ఇటీవల చాలా లేఖలు రాశారు. కొందరు మంత్రులు కూడా పునీత్ కు అవార్డులివ్వాలని కోరారు. తాజాగా పునీత్ కు 'కర్ణాటక రత్న' అవార్డు ప్రకటించడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డును పునీత్ తరఫున ఆయన కుటుంబసభ్యులు అందుకోనున్నారు.
Also Read: బిజీ డిసెంబర్... అసలు గ్యాప్ లేదుగా..
Also Read: పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లడం లేదు... సంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయక్'
Also Read: కోటి రూపాయలు గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలంగాణ పోలీస్
Also Read: డిసెంబర్‌లో కీర్తీ సురేష్ డబుల్ ధమాకా... ఇటు గురి, అటు హిస్టరీ!
Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి కథియవాడి'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి