ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 26,514 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 191 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కోవిడ్ తో తాజాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,418కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 416 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,53,134 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 2,734 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: చేపల్లో మాత్రమే కాదు, వీటిలో కూడా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు... శాకాహారులకు ప్రత్యేకం
పెరిగిన రికవరీలు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,286కి చేరింది. వీరిలో 20,53,134 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 416 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 2,734 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,418కు చేరింది.
తెలంగాణలో కొత్తగా 167 కొవిడ్ కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 37,283 పరీక్షలు నిర్వహించారు. ఈ నమూనాల్లో 167 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,889కు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,976కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 164 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 3,737 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Also Read: ఒత్తిడి, ఆందోళన వేధిస్తున్నాయా? ప్రశాంతంగా లేదా? ఈ టీలను ప్రయత్నించండి
భారత్ లో కేసులు
దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్తగా 8,865 కరోనా కేసులు నమోదుకాగా 197 మంది వైరస్‌తో మృతి చెందారు. గత 287 రోజుల్లో ఇదే అత్యల్పం. 11,971 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,30,793కు చేరింది. గత 525 రోజుల్లో ఇదే అత్యల్పం.
Also Read: దేశంలో కొత్తగా 8,865 కరోనా కేసులు.. గత 287 రోజుల్లో ఇదే అత్యల్పం
థర్డ్ వేవ్ ముప్పు
భారత్‌లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే కరోనా థర్డ్ వేవ్‌పై ఇప్పటికీ చాలా భయాలున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కరోనా థర్డ్ వేవ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతాయని వ్యాక్సినేషన్‌పై అన్ని దేశాలు దృష్టి సారించాలన్నారు.