దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్తగా 8,865 కరోనా కేసులు నమోదుకాగా 197 మంది వైరస్‌తో మృతి చెందారు. గత 287 రోజుల్లో ఇదే అత్యల్పం. 11,971 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసుల సంఖ్య 1,30,793కు చేరింది. గత 525 రోజుల్లో ఇదే అత్యల్పం.
కేరళలోనూ కరోనా కేసులు తగ్గుతున్నాయి. కొత్తగా 4,547 కోరనా కేసులు నమోదుకాగా 57 మంది వైరస్‌తో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 50,65,619కి పెరగగా 35,877 మంది ఇప్పటివరకు మృతి చెందారు.
తిరువనంతపురంలో అత్యధికంగా 709 కేసులు నమోదయ్యాయి. ఎర్నాకులం (616), కోజికోడ్ (568) తర్వాతి స్థానాాల్లో ఉన్నాయి.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 686 కరోనా కేసులు నమోదుకాగా 19 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 66,24,986కు పెరగగా మృతుల సంఖ్య 1,40,602కు చేరింది.
పరీక్షలు..
దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 11,07,617 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 62,57,74,159కి చేరినట్లు చెప్పింది.
Read Also: ఒత్తిడి, ఆందోళన వేధిస్తున్నాయా? ప్రశాంతంగా లేదా? ఈ టీలను ప్రయత్నించండి
Read Also: చేపల్లో మాత్రమే కాదు, వీటిలో కూడా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు... శాకాహారులకు ప్రత్యేకం
Read Also: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
Read Also: వంటల్లో ఈ మూడు మసాలాలు కచ్చితంగా వాడండి, క్యాన్సర్ రిస్క్‌ను సగం తగ్గించుకోండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి