ఈ ప్రపంచంలో మొట్టమొదటి పైలట్... రావణాసురుడేనని శ్రీలంక ప్రభుత్వం నమ్ముతోంది. ఐదు వేళ్ల ఏళ్ల కిందటే ఆయన గగన యాత్ర చేశారనే ఆలోచనతో ఇప్పటికే.. కొత్త పరిశోధన మొదలుపెట్టింది. ఎన్నో ప్రశ్నలకు శ్రీలంక ప్రభుత్వం సమాధానాలు వెతకాలనుకుంటోంది. ఇంతకీ రావణుడి దగ్గర విమానాలు ఉన్నాయా? 


శ్రీలంక ప్రభుత్వం.. గతంలో ఓ పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎందుకోసమంటే.. రావణుడు వద్ద విమానాలు ఉన్నాయని ఆ ప్రభుత్వం చెబుతోంది. శ్రీలంక నుంచి భారత్ కు విమానంలో వచ్చడా? దీనిపై ఎప్పటి నుంచో.. పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే కరోనా కారణంగా.. ఈ పరిశోధన ఆగిపోయింది. భారత ప్రభుత్వం సైతం ఇందులో పాల్గొని... సహకారం అందించాలని శ్రీలంక కోరుతోంది.


శ్రీలంక గతంపై వివరణాత్మక శాస్త్రీయ పరిశోధనను నిర్వహించడం ద్వారా ప్రాచీన వైభవాన్ని తిరిగి పొందాలనుకుంటోంది. చాలా మంది శ్రీలంక వాసులు రావణుడు ప్రపంచంలోనే మొట్టమొదటి అనుభవజ్ఞుడైన పైలెట్ అని అంటుంటారు. ఆయన కాలంలో విమానాలు, విమానాశ్రయాలు ఉన్నాయని నమ్ముతారు. ఇవి నమ్మకాలు మాత్రమే అని చెప్పేవారికి.. నిజాలు అని చెప్పేందుకు శ్రీలంక పరిశోధన బృందం.. పరిశోధనలు చేస్తోంది. అసలు నిజమేంటి అని విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనుకుంటోంది. 


పౌర విమానయాన శాఖ నిపుణులు, చరిత్రకారులు, పురతత్వవేత్తలు, సైంటిస్టులు అందరూ కలిసి రెండేళ్ల క్రితం సమావేశమయ్యారు. 5వేల ఏళ్ల కిందట రావణుడు వాయు మార్గంలో ఇండియా నుంచీ శ్రీలంకకు వెళ్లాడనీ, తిరిగి శ్రీలంక వచ్చాడని ఆ సమయంలో వాళ్లు తేల్చారు.
ఆ సమావేశం తర్వాత పరిశోధనను ప్రారంభించడానికి శ్రీలంక ప్రభుత్వం 5 మిలియన్ల శ్రీలంక రూపీస్(SLR)ను ప్రారంభ గ్రాంట్‌ గా మంజూరు చేసింది. కొవిడ్-19 లాక్‌డౌన్‌ కారణంగా పరిశోధన ఆగిపోయింది. ప్రస్తుతం మళ్లీ ఈ ప్రాజెక్టుపై పనులు జరుగుతున్నాయి. రాజపక్సే ప్రస్తుత ప్రభుత్వం కూడా దానిపై ఆసక్తి చూపుతోంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్‌ను కొనసాగించడానికి వారు అంగీకరించారు. పరిశోధకులు వచ్చే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తారని శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ మాజీ వైస్ ఛైర్మన్ శశి దానతుంగే చెబుతున్నారు.


 Also Read:Spirituality: శనివారం ఈ వస్తులు కొన్నా-తీసుకున్నా ….శని మిమ్మల్ని వదలదంట


Also Read: Asta Kastalu: ఎంగిలి తింటున్నారా? వామ్మో కరోనా కంటే అదే పెద్ద కష్టమట!


Also Read: Sabarimala Temple Reopen : మరికొన్ని గంటల్లో తెరుచుకోనున్న శబరిమల ఆలయం


Also Read: Thanjavur Brihadeeswara Temple: వెయ్యేళ్లనాటి ఆ ఆలయం చుట్టూ రంధ్రాలు... ఎందుకో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు...