సూర్యుడు,  ఛాయాదేవి  కుమారుడు-నవగ్రహాల్లో ఒకరు శనీశ్వరుడు. గ్రహాల సంచారం ఆధారంగా ఒక్కొక్కరిపై శనిప్రభావం ఒక్కోలా ఉంటుంది. అయితే కేవలం శని నడుస్తున్నప్పుడే కాదు నిత్యం మనం చేసే కొన్ని పనుల వల్ల కూడా ఆ ప్రభావం పడుతుందని చెబుతారు. మరీ ముఖ్యంగా శనివారం రోజున శనిదేవుడిని అర్చించడం మంచిదే కానీ ఆ రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం కానీ చేతికి అందుకోవడం కానీ చేయరాదంటారు.
Also Read: ఎంగిలి తింటున్నారా? వామ్మో కరోనా కంటే అదే పెద్ద కష్టమట!



  • శనివారం ఇనుముతో తయారైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల అస్సలు కలసిరాదంటారు. ముఖ్యంగా వ్యాపారులకు లాభం మాట దేవుడెరుగు నష్టపోతారట.

  • నువ్వుల నూనె , నువ్వులను కొనకూడదు, ఎవ్వరి చేతి నుంచీ అందుకోకూడదు. అలా చేస్తే  సాక్షాత్తు శనీశ్వరుని ఇంటికి ఆహ్వానించినట్లు. ఎందుకంటే నువ్వులు శనికి నువ్వులంటే అత్యంత ప్రీతి కాబట్టి వాటిని చేతికందుకున్నా, కొన్నా శనిని తీసుకొచ్చినట్టే .

  • అలాగే శనివారం రోజున ఆవాలతో చేసిన వంటలు కానీ, ఆవు నూనె కాని వాడకూడదు.

  • శనివారం నల్లని దుస్తులు, నలుపు గాజులు, నలుపు రంగు బూట్లు కొనరాదు. ధరించరాదు. ఈ రోజున శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నువ్వులను సమర్పించి, నల్లని వస్త్రాన్నిమాలగా అలంకరించి పూజించడం ద్వారా అష్ట దరిద్రాలు తొలగి పోయి సుఖశాంతులు, సిరి సంపదలు కలుగుతాయని చెబుతారు

  • శనివారం ఆవాలు కొన్నా, ఎవరినైనా అడిగి తెచ్చుకున్నా ఎన్ని ఆవాలున్నాయో  అన్ని సమస్యలు చుట్టుముడతాయట.

  • ఉప్పు, మిరియాలు, వంకాయలు కూడా కొనకూడదు, ఎవ్వరి దగ్గరా తీసుకోరాదు


Also Read: అయ్యప్ప మాల వెనుక ఆరోగ్యం రహస్యం ఏంటి.. స్వామి అని ఎందుకు పిలవాలి...
పట్టించుకున్నవారికి అన్నీ లేనివారికి ఏమీలేదన్నట్టు..వీటిని పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనేది మనం అనుసరించే సెంటిమెంట్స్ ఆధారంగా ఉంటుంది. నమ్మకం ఉన్నవారు ఫాలో అవుతారు.. నమ్మకం లేనివారు నవ్వి ఊరుకుంటారు. కానీ తరతరాలుగా చెబుతున్న విషయాలివి. 
Also Read: 18 నంబర్ కి అయ్యప్పకి సంబంధం ఏంటి... మీ లక్షణాలను బట్టి మీరు ఎన్నో మెట్టుపై ఉన్నారో తెలుసుకోండి..
Also Read: వెయ్యేళ్లనాటి ఆ ఆలయం చుట్టూ రంధ్రాలు... ఎందుకో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు...
Also Read: భక్తి పేరుతో అనారోగ్యం కొనితెచ్చువద్దు... చాదస్తంతో ప్రాణాలను ఫణంగా పెట్టొద్దు..
Also Read: వందేళ్ల తర్వాత కాశీకి చేరిన అన్నపూర్ణ విగ్రహం...ఈ నెల 15న పున:ప్రతిష్టాపన
Also Read: శివుడికే కాదు మనకూ మూడో కన్ను ఉందని మీకు తెలుసా...!
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి