సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్‌కు వాలంటరీ రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్‌ను కలిసి రాజీనామా పత్రం అందించారు. వెంటనే ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా అధికార పార్టీలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల కసరత్తు పూర్తి చేశారు.


Also Read : బండి సంజయ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తత.. చెప్పులు, గుడ్లు విసురుకున్న నేతలు


స్థానిక సంస్థల కోటా కింద మెదక్ లేదా కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఒక చోట నుంచి కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గ్రూప్ వన్ అధికారిగా సర్వీసులోకి వచ్చి ప్రమోషన్ మీద ఐఏఎస్ అయిన వెంకట్రామిరెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత ఆప్తునిగా పేరు తెచ్చుకున్నారు. కేసీఆర్ కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్‌కు తెలంగాణ ఏర్పడినప్పటి నుండి కలెక్టర్‌గా ఉన్నారు. జిల్లాల విభజన తర్వాత ఆయన సిద్దిపేటలో విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా రెండు, మూడేళ్లకు కలెక్టర్లను బదిలీ చేస్తూంటారు. కానీ కేసీఆర్ నమ్మకం పొందిన వెంకట్రామిరెడ్డి మాత్రం అక్కడే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. 


Also Read: కేసీఆర్‌కి తెలంగాణ గురించి ఏం తెలుసు? అన్నీ డ్రామాలే.. ఆ విషయం ఒప్పుకున్నట్లేగా..: మధుయాస్కీ


ఈ సమయంలో ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లాంటివి జరిగితే టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్ష పార్టీలు ఆరోపించాయి. దుబ్బాక ఉపఎన్నికల సమయంలో ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు వెంకట్రామిరెడ్డిపై అనేక ఆరోపణలు చేస్తూ ఉంటారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు బినామీగా వెంకట్రామిరెడ్డిగా చెబుతూ ఉంటారు. ఇటీవల హైదరాబాద్ శివారులో వేలం వేసిన భూములను రాజపుష్ప అనే కంపెనీ కూడా కొనుగోలు చేసింది. ఇది వెంకట్రామిరెడ్డి బంధువులదని రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు. 


Also Read: విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా


ఇటీవల సుప్రీంకోర్టు చెప్పినా వినను .. వరి వేయవద్దని రైతులను హెచ్చరిస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. వెంకట్రామిరెడ్డికి రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని అధికార వర్గాల్లో ప్రచారం ఉంది. సీఎం కేసీఆర్ అంటే ఆయనకు ఎంత అభిమానం అంటే.. ఇటీవల కలెక్టర్ భవన ప్రారంభోత్సవానికి జిల్లాకు కేసీఆర్ వెళ్లినప్పుడు ఆయన కాళ్లకు మొక్కారు. కలెక్టర్ స్థానంలో ఉండి అలా చేయడం ఏమిటన్న విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఆయన సర్వీస్ ఏడాదిలోపే ఉంది. అందుకే ఇప్పుడే ఉద్యోగానికి రాజీనామా రాజకీయాల్లోకి రావాలనిడిసైడయ్యారు. 


Also Read: నా భార్య బజారుకీడుస్తోంది, చచ్చిపోతున్నా.. పురుగుల మందు తాగేసిన బ్యాంకు ఉద్యోగి.. చివరికి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి