ఏపీలోని తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభం అయ్యింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశం రాత్రి 7 వరకు జరగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. ఏపీ సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. సమావేశం అజెండాను అంతర్రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి ప్రవేశపెట్టారు. ఈ సమావేశానికి అమిత్ షా ముగింపు ఉపన్యాసం చేస్తారు. ఈ సమావేశం అజెండాలో మొత్తం 26 అంశాలు ఉన్నాయి. గత సమావేశ నిర్ణయాలకు సంబంధించిన 2 నివేదికలపై కూడా చర్చ జరగనుంది. తర్వాతి సమావేశం వేదిక ఖరారు, మరో 24 కొత్త అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
ఎవరెవరు హాజరు
ఈ సమావేశంలో తమిళనాడు నుంచి ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్నుమూడి, కేరళ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి రాజన్, తెలంగాణ నుంచి హోం మంత్రి మహమూద్ అలీ, పుదుచ్చేరి సీఎం రంగసామి, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, ఏపీ సీఎం జగన్, పుదుచ్చేరి ఇంఛార్జి గవర్నర్ తమిళిసై, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవ్ంద్ర కుమార్ జోషి, లక్ష్యద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు.
Also Read: గుడికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడికి వచ్చినా అంతే పుణ్యం: వెంకయ్య నాయుడు
విభజన హామీలపై సీఎం జగన్ కీలక ఉపన్యాసం
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని సీఎం జగన్ అన్నారు. విభజన జరిగి ఏడేళ్లైనా హామీలు ఇప్పటి వరకూ అమలుకాలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. తెలంగాణ నుంచి విద్యుత్ బాకీలు రాలేదన్న సీఎం.. రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు పూర్తికాలేదన్నారు. విద్యుత్ రుణాల్లో కోత విధిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారించాలని సీఎం జగన్ కోరారు. దీని కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో మాట్లాడిన సీఎం జగన్.. విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదన్నారు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు.
Also Read: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్... నడకదారిలో వచ్చే భక్తులకు దర్శనాలు..!
Also Read: 'ఎన్నో పదవులకు ఆయన వన్నె తెచ్చారు.. నా కోరిక నేటికి నెరవేరింది'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి