దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 10,229 కరోనా కేసులు నమోదుకాగా 125 మంది మృతి చెందారు. 11,926 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.






మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.39%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 98.26%గా ఉంది. 2020 మార్చి నుంచి అదే అత్యధికం.






మొత్తం కేసులు: 3,44,47,536


యాక్టివ్ కేసులు: 1,34,096 (గత 523 రోజుల్లో ఇదే అత్యల్పం)



మొత్తం రికవరీలు: 3,38,49,785


మొత్తం మరణాలు: 4,63,655


మొత్తం వ్యాక్సినేషన్: 1,12,34,30,478


కేరళ..


కేరళలో కూడా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కొత్తగా 5,848 కేసులు నమోదయ్యాయి. 65 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 50,61,072కు పెరగగా మరణాల సంఖ్య 35,750కి చేరింది.


మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో అత్యధికంగా 919 కరోనా కేసులు నమోదుకాగా కోజికోడ్ (715), తిరువనంతపురం (724) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


మహారాష్ట్ర..


మహారాష్ట్రలో కొత్తగా 956 మందికి వైరస్ సోకింది. 18 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 66,24,300కు పెరగగా మరణాల సంఖ్య 1,40,583కు చేరింది.


Also read: తన గేదెపైనే కంప్లయింట్ ఇచ్చిన అమాయకపు రైతు... గేదె చేసిన తప్పు అదే


Also read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...