రెగ్యులర్ గా మనం వాడే పదాల్లో చాలావాటికి అర్థాలు తెలియకపోయినా వాడేస్తాం. వాస్తవానికి ఆ మాట విన్నవారికి కూడా అర్థం తెలియకపోయినా ఆ పదం వాడటం వెనుక ఉద్దేశం అర్థమైపోతుంది. అలాంటి పదాల్లో ఒకటి అష్టకష్టాలు. ఈ మాట అనని వారు, వినని వారు దాదాపు ఉండరు. ఏ చిన్న సమస్యను అధిగమించినా, తీరని కష్టం అనుకోకుండా తీరినా ఈ పదం వినయోగిస్తుంటారు. అష్టకష్టాలు పడ్డాం అని ఒక్కమాటతో చెబుతారు. ఇంతకీ అష్టకష్టాలంటే ఏంటో తెలుసా...Also Read: అయ్యప్ప మాల వెనుక ఆరోగ్యం రహస్యం ఏంటి.. స్వామి అని ఎందుకు పిలవాలి...ఆ అష్టకష్టాలు ( ఎనిమిది కష్టాలు) ఏంటో చెప్పే శ్లోకంఋణం చయాచ్నా వృద్ధత్వం జారచోర దరిద్రతా !రోగశ్చ భుక్త శేషశ్చా ప్యష్టకష్టాః ప్రకీర్తితాః !!అష్టకష్టాలు1. అప్పు- అప్పు తీసుకోవడం2. యాచన- అడుక్కోవడం3. ముసలితనం4. వ్యభిచారం5. చోరత్వం-దొంగతనం చేయడం6. దారిద్య్రం-పేదరికం7. రోగం8. ఎంగిలి భోజనం- ఎంగిలి తినడం ఈ మధ్య చాలా సర్వసాధారణం అయిపోయింది. ఇంకా చెప్పాలంటే అదో ట్రెండ్ అని ఫిక్సైపోయారు. ఎవరైనా ఎంగిలి తినను అని చెబితే వింతగా చూసే పరిస్థితులున్నాయి. ఏదో ఈ మధ్య కరోనా భయానికి కాస్త తగ్గినా.. మళ్లీ వైరస్ భయం తగ్గాక ఎప్పటిలా ఫాలోఅయిపోతున్నారు. వాస్తవానికి ఎంగిలి భోజనం అంటే అష్టకష్టాల్లో భాగమే అని చెబుతారు పెద్దలు. Also Read: 18 నంబర్ కి అయ్యప్పకి సంబంధం ఏంటి... మీ లక్షణాలను బట్టి మీరు ఎన్నో మెట్టుపై ఉన్నారో తెలుసుకోండి..ఈ ఎనిమిదింటిని కూడా అష్టకష్టాలు అంటారని చెబుతారువాస్తవానికి అష్టకష్టాలంటే 'దేశాంతర గమనం, భార్యావియోగం, ఆపత్కాల బంధుదర్శనం, ఉచ్ఛిష్ట భోజనం, శత్రుస్నేహం, పరాన్న ప్రతీక్షణం, అప్రతిష్ఠ, దారిద్య్రం" అని చెబుతారు. Also Read: వెయ్యేళ్లనాటి ఆ ఆలయం చుట్టూ రంధ్రాలు... ఎందుకో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు...Also Read: భక్తి పేరుతో అనారోగ్యం కొనితెచ్చువద్దు... చాదస్తంతో ప్రాణాలను ఫణంగా పెట్టొద్దు..Also Read: భక్తి పేరుతో అనారోగ్యం కొనితెచ్చువద్దు... చాదస్తంతో ప్రాణాలను ఫణంగా పెట్టొద్దు..Also Read: వందేళ్ల తర్వాత కాశీకి చేరిన అన్నపూర్ణ విగ్రహం...ఈ నెల 15న పున:ప్రతిష్టాపనAlso Read: శివుడికే కాదు మనకూ మూడో కన్ను ఉందని మీకు తెలుసా...!Also Read: శివుడి ఆజ్ఞ లేనిదే అక్కడ శిలైనా కదలదు...Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Asta Kastalu: ఎంగిలి తింటున్నారా? వామ్మో కరోనా కంటే అదే పెద్ద కష్టమట!
ABP Desam | RamaLakshmibai | 15 Nov 2021 03:43 PM (IST)
అష్టకష్టాలు ఇవే..
Astakastalu