ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మినీ స్థానిక సమరంలో అందరి చూపు కుప్పం మున్సిపల్ ఎన్నికలపైనే ఉంది. చంద్రబాబు నియోజకవర్గంలో మున్సిపాలిటీని గెలిచి సత్తా చాటాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతూండగా..  పట్టు చూపించేందుకు టీడీపీ నేతలు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. రెండు రోజుల నుంచి అధికార వైఎస్ఆర్‌సీపీ నేతలు దొంగ ఓటర్లను పట్టణంలోకి తీసుకొచ్చి ఉంచారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పలు చోట్ల గుంపులుగా ఉన్న వారిని పట్టించే ప్రయత్నం చేశారు. పోలింగ్ రోజు కూడా అదే దొంగ ఓటర్ల హడావుడి కుప్పంలో కనిపిస్తోంది. 


 





Also Read : అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ ... ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు !


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటింగ్‌కు దూరంగా ఉండే వారిని.. వలస ఓటర్లను గుర్తించి వారి ఓట్లను ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన వారితో వేయిస్తున్నారని వాలంటీర్లు సహకరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద టీడీపీ నేతలు చెకింగ్ చేస్తున్నారు. ఈ సందర్బం ఆ ప్రాంతానికి సంబంధం లేని వారు ఓటింగ్‌కు వస్తే పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. ఇలా దొంగ ఓటర్లను పట్టుకున్నామని టీడీపీ నేతలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నారా లోకేష్ కూడా ఈ వీడియోలను ట్వీట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. 


 





Also Read : విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా


కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉండగా 24 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓ వార్డు ఏకగ్రీవం అయినట్లుగా అధికారులు ప్రకటిచారు. మున్సిపల్‌ పరిధిలో మొత్తం 48 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 9 సమస్యాత్మక, మరో 9 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా డిక్లేర్ చేసి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు కాకుండా వారికి రక్షణ కల్పించేందుకు పని చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తున్నారు. పలు చోట్ల టీడీపీ నేతలే దొంగ ఓటర్లను పట్టుకుని .. వీడియోలు తీస్తున్నారు. 



Also Read : అప్పుడు అమ్మఒడి ఇప్పుడు అమ్మకానికో బడి... విద్యాసంవత్సరం మధ్యలో విలీనమా... ఏపీ సర్కార్ పై పవన్ ఫైర్


కమతమూరులో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపారు. 16వ వార్డులో టీడీపీ అభ్యర్థిని, ఏజెంట్‌ను పోలింగ్ కేంద్రం నుంచి పంపేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేయిస్తున్నారని అడ్డుకోవాలని ఎస్ఈసీ నీలం సాహ్నీకి ఫిర్యాదు చేశారు.


Also Read: దావోస్‌కు సీఎం జగన్ ! వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆహ్వానాన్ని మన్నిస్తారా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి