ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనవరిలో విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరు కావాల్సిందిగా సీఎం జగన్‌కు ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రతినిధులతో పాటు భారీ పెట్టుబడిదారులు అక్కడకు వస్తారు. అక్కడ ప్రతి దేశం తమ గురించి ప్రమోట్ చేసుకుని పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి.
Also Read : చంద్రబాబు మీద లోకేశ్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది
వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రతినిధి బోర్జ్ బ్రెండె ఢిల్లీలో మంత్రి గౌతమ్ రెడ్డిని కలిశారు. వచ్చే జనవరి 17-21 మధ్య దావోస్‌లో నిర్వహించే సదస్సులో సీఎం జగన్‌ను పాల్గొనాలని కోరిారు. ఈ సారి "వర్కింగ్ టుగెదర్, రీస్టోరింగ్ ట్రస్ట్" అంశంపై సమావేశం జరగుతోందని.. బ్రెండె గౌతంరెడ్డికి తెలిపారు. కోవిడ్-19 నియంత్రణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను బోర్ట్ బ్రెండె ప్రశంసించారని .. పారిశ్రామిక విధానం, ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై అభినందించారని ప్రభుత్వం తెలిపింది.
సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ప్రతి ఏడాది దావోస్‌కు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేసే ప్రయత్నాలు చేసేవారు. ప్రత్యేకంగా స్టాల్ పెట్టేవారు. అయితే సీఎంగా జగన్ వచ్చిన తర్వాత ఏపీ ప్రతినిధి బృందం దావోస్ వెళ్లడం లేదు. వచ్చే ఏడాది జరగనున్న దావోస్ సమావేశానికి కూడా ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు పంపారు. రెండు నెలల కిందటే తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. కరోనా పరిస్థితుల నుంచి తెలంగాణ వేగంగా బయటపడటానికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఆహ్వానిస్తున్నట్లుగా ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది.
Also Read: Maoist Ravi: బాంబు ప్రమాదంలో మావోయిస్టు రవి మృతి... ఏడాదిన్నర తర్వాత ధ్రువీకరించిన మావోయిస్టు పార్టీ
ఇప్పుడు సీఎం జగన్‌కు కూడా ఆహ్వానం అందడంతో ఈ సారి ఏపీ ప్రభుత్వం నుంచి కూడా దావోస్‌కు ప్రతినిధి బృందం వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పలువురు ముఖ్యమంత్రులు కూడా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి సీఎం జగన్ కూడా వెళ్తారని భావిస్తున్నారు. వెళ్లకపోతే ప్రతినిధి బృందం వెళ్లి ఏపీని దావోస్‌లో ప్రమోట్ చేసే అవకాశం ఉంది.
Also Read: Nellore News: వానలు వెలిశాయి.. వ్యాధులు పొంచి ఉన్నాయి... జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన