అత్యంత ప్రాచీన ఆలయాల్లో తంజావూరు బృహదీశ్వర ఆలయం ఒకటి. 11వ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందింది. తంజావూరులో మొత్తం 74 దేవాలయాల్లో అత్యద్భుతమైనది  శ్రీ బృహదేశ్వర ఆలయం. గ్రానైట్ తో నిర్మించిన ప్రపంచంలోనే మొట్ట మొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. తంజావూరు పర్యటనలో ఉన్న పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించాల్సిన ఆలయం ఇది. ఈ దేవాలయాన్ని వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయ గోడలపై సర్వ దేవతల విగ్రహాలు ఉంటాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. అష్ట దిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఇదొకటి.
Also Read:  అయ్యప్ప మాల వెనుక ఆరోగ్యం రహస్యం ఏంటి.. స్వామి అని ఎందుకు పిలవాలి...
ఆలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు 



  • వేయి సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం అయినప్పటికీ ఇప్పటికీ  కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయం ఇది

  • 13 అంతస్థులతో నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణానికి ఉక్కు, సిమెంట్ వాడలేదు. నిర్మాణం మొత్తం గ్రానైట్ రాయితోనే

  • భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది

  • శివలింగం ఎత్తు దాదాపుగా 3.7 మీటర్లు, నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు, గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించారు.

  • మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా ఆలయ గోపురం నీడ మాత్రం కనిపించదు.

  • ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంద్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. 


Also Read:  18 నంబర్ కి అయ్యప్పకి సంబంధం ఏంటి... మీ లక్షణాలను బట్టి మీరు ఎన్నో మెట్టుపై ఉన్నారో తెలుసుకోండి..
Also Read: భక్తి పేరుతో అనారోగ్యం కొనితెచ్చువద్దు... చాదస్తంతో ప్రాణాలను ఫణంగా పెట్టొద్దు..
Also Read: వందేళ్ల తర్వాత కాశీకి చేరిన అన్నపూర్ణ విగ్రహం...ఈ నెల 15న పున:ప్రతిష్టాపన
Also Read: శివుడికే కాదు మనకూ మూడో కన్ను ఉందని మీకు తెలుసా...!
Also Read: శివుడి ఆజ్ఞ లేనిదే అక్కడ శిలైనా కదలదు...
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read:  ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి