Karnataka: తల్లిని విడిచిపెట్టడానికి పిల్లలు అంతగా ఇష్టపడరు. తల్లి నుంచి బిడ్డను వేరు చేయాలని చూస్తే ఏడుపు మొదలుపెడతారు. మనకే కాదు జంతువులకు కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. తల్లి నుంచి తాత్కాలికంగా వేరు చేయడానికి ప్రయత్నించడంతో పునీత్ రాజ్‌కుమార్ అలిగాడు. రానంటూ కాసేపు మొండికేశాడు. చివరి తాళ్లు కట్టి మరీ తీసుకెళ్లాల్సి వచ్చింది. 


అదేంటీ కన్నట పవర్ స్టార్ పునీత్ ఇటీవల కన్నుమూశారు కదా అనుకుంటున్నారా. మీ సందేహం నిజమే. ఇక్కడ పునీత్ రాజ్‌కుమార్ అంటే చిన్న ఏనుగు పిల్ల. హీరో పేరు గున్న ఏనుగుకు పెట్టడం ఏంటంటారా.. ఆ వివరాలపై ఓ లుక్కేయండి. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అటవీ కేంద్రంలో రెండేళ్ల ఏనుగు పిల్లకు ఇటీవల పునీత్ రాజ్ కుమార్ అని నామకరణం చేశారు. ఎందుకంటే పునీత్ స్వయంగా సమయాన్ని గడిపి, సరదాగా ఆడుకున్న చిన్న ఏనుగు అది.
Also Read: ఎంత పని సేస్తివి.. అత్యాశతో రైలు కింద కాళ్లు పెట్టాడు.. రూ.24 కోట్లు పాయే!






పునీత్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఏనుగుల శిక్షణ కేంద్రానికి వెళ్లారు. అక్కడ దాదాపు రెండు మూడు గంటలపాటు గడిపిన పునీత్‌కు ఈ చిన్న ఏనుగు తెగ నచ్చేసింది. దానితో సరదాగా కాసేపు ఆడుకున్న అనంతరం పునీత్ ఆ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఇటీవల జిమ్ చేస్తూ ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్చినా ప్రయోజనం లేకపోయింది. పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలను నిర్వహించింది.
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!






పునీత్ తమ అటవీ కేంద్రానికి వచ్చిన సమయంలో క్యాంపులో చిన్న ఏనుగుతో కొన్ని గంటలపాటు గడిపారని శివమొగ్గ అటవీ వైల్డ్ లైఫ్ డివిజన్ డిప్యూటీ కన్జర్వేటర్ నాగరాజ్ తెలిపారు. సూపర్ స్టార్ పునీత్ గౌరవార్థం ఆ ఏనుగు పిల్లకు ఆయన పేరిట ఇటీవల నామకరణం చేశారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, అభిమానుల కోరిక మేరకు పునీత్ ఎంతో ఇష్టపడ్డ ఏనుగు పునీత్ రాజ్‌కుమార్‌గా నామకరణం చేసినట్లు తెలిపారు. అయితే రెండు రోజుల కిందట శిక్షణ కోసం పునీత్‌ను తల్లి నుంచి వేరుచేసి తీసుకెళ్లడానికి అటవీ సిబ్బంది ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ పిల్ల ఏనుగు ప్రతిఘటించింది. చివరికి తాళ్లు కట్టి మరీ చిన్న ఏనుగు పునీత్‌ను శిక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. ఇక అది మొదలుకుని పిల్ల ఏనుగు పునీత్ రాజ్‌కుమార్ కర్ణాటకలో ఫేమస్ అయిపోయింది. 


Also Read: ఉప్పుతో మెదడుకు ముప్పు? షాకింగ్ విషయాలు బయటపెట్టిన తాజా అధ్యయనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి