ఎవరైనా కావాలని వికలాంగులు అవుతారా? తన కాళ్లు.. చేతులను కట్ చేసుకుంటారా? అయితే, ఈ వ్యక్తి అదే చేశాడు. డబ్బుకు ఆశపడి ఏకంగా రైలు పట్టాలపై పడుకున్నాడు. తన రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. ప్రాణాలకు తెగించి మరీ ఈ ఘనకార్యానికి పాల్పడిన అతడికి.. డబ్బులు దొరికాయా? చివరికి ఏం జరిగింది? 


హంగేరీకి చెందిన సాండర్ అనే వ్యక్తి రైలు కింద కాళ్లు పెట్టాడు. చివరికి రెండు కాళ్లు కోల్పోయాడు. మోకాలికి కింది భాగమంతా నజ్జు కావడంతో వైద్యులు అతడికి కృత్రిమ కాళ్లను అమర్చారు. ఇక అతడు జీవితాంతం కాళ్లు లేకుండా.. వీల్ చైర్‌కి పరిమితం కావాల్సిందేనని వైద్యులు తెలిపారు. అతడి పరిస్థితి చూసి అంతా అయ్యో పాపం అనుకున్నారు. కానీ, అసలు విషయం తెలిసి అంతా ముక్కున వేలు వేసుకున్నారు. 


ప్రమాదం తర్వాత సాండర్ భార్య.. తన భర్త రెండు కాళ్లను కోల్పోయాడని, ఆయనకు అందాల్సిన రూ.24 కోట్ల బీమాను చెల్లించాలని అధికారులను కోరింది. ఈ సందర్భంగా అధికారులు విచారణ మొదలుపెట్టారు. బాధితుడు సాండర్.. ఈ ప్రమాదం జరగడానికి ఏడాది ముందు 14 హై-రిస్క్ లైఫ్ ఇన్సురెన్స్‌ పోలసీలు చేయించుకున్నాడని విచారణలో తెలిసింది. అన్ని బీమాలు ఎందుకు తీసుకున్నావని ప్రశ్నిస్తే.. సేవింగ్ అకౌంట్స్ కంటే ఇన్సురెన్స్ పాలసీల ద్వారానే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని తెలిసి అలా చేశానన్నాడు. 


బీమా అధికారులు ఈ కేసును మరింత లోతుగా అన్వేషించారు. సాండర్ కావాలనే తన కాళ్లను పోగొట్టుకుని ఇన్సురెన్స్‌కు ధరఖాస్తు చేసుకున్నాడని అనుమానించారు. దీంతో అతడికి దక్కాల్సిన రూ.24 కోట్లు బీమా చెల్లించేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు సాండర్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించడమే కాకుండా లీగల్ ఖర్చులకు రూ.4.70 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. చిత్రం ఏమిటంటే.. ఈ ఘటన చోటుచేసుకున్న ఏడేళ్ల తర్వాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. చివరికి బాధితుడు కాళ్లు కోల్పోయాడు.. అందాల్సిన బీమాలను సైతం చేజార్చుకుని.. జైలుకు వెళ్లాడు. 


Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి