దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఉత్తరాఖండ్ జలప్రళయం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరదల కారణంగా వందల కోట్ల నష్టం జరిగింది. వేలాది భక్తులు మృతి చెందారు. భారీ భవంతులు వరదల్లో కొట్టుకుపోయాయి. బస్సులు కొట్టుకుపోయాయి. అయితే కేదార్ నాథ్ ఆలయం చెక్కుచెదరకపోవడం చర్చనీయాంశమైంది. పాండవులు కట్టించిన ఈ ఆలయాన్ని దాదాపు పన్నెండు వందల ఏళ్ల క్రితం ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించారని చెబుతారు. అప్పుడెప్పుడో జరిగి ఈ ఘటన, భీమ శిల గురించి కార్తీకమాసం సందర్భంగా పరమేశ్వరుడి లీల అంటూ తలుచుకుంటున్నారు భక్తులు ఆ శిలను కూడా పూజిస్తున్నారు.
ఇంతకీ కేదార్ నాథ్ లో ఏం జరిగిందంటే...16 జూన్ 2013 న భారీ వర్షపాతం నమోదైంది. జూన్ 16, రాత్రి 8 గంటల సమయంలో అకస్మాత్తుగా ఆలయం వెనుకున్న కొండపై నుంచి బలమైన నీటి ప్రవాహం కనిపించింది. ఈ దృశ్యం చూసి శివయ్యే దిక్కంటూ యాత్రికులంతా ఆలయంలోపలికి వెళ్లిపోయారు. తమకేం జరగదని సర్దిచెప్పుకున్నారు. ఆలయం చుట్టూ వరదనీరు చేరింది. జలప్రళయానికి చుట్టూ అన్నీ నేలమట్టమైపోయాయి. వాస్తవానికి ఆలయానికి కూడా ముప్పు పొంచిఉంది. కానీ అంతలోనే ఓ అద్భుతం జరిగిందని చెప్పారు ఇద్దరు సాధువులు. ఆ దృశ్యాన్ని కళ్లారా చూశామన్నారు.
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
జూన్ 16 న వరద సమయంలో ఈ సాధువులు ఇద్దరూ ఆలయానికి సమీపంలో ఉన్న స్తంభంపైకి ఎక్కి అక్కడున్న వారిని నిద్రలేపి అప్రమత్తం చేయడం ద్వారా కొందరి ప్రాణాలు కాపాడగలిగారు. అదే సమయంలో కొండపై నుంచి ఓ పెద్ద శిల జోరుగా దొర్లుకుంటూ వచ్చి ఆలయానికి 50 అడుగుల దూరంలో ఎవరో ఆపినట్టు ఆగిపోయిందట. ఆ శిల వరకూ వచ్చిన వరదనీరు రెండు పాయలుగా చీలి ఆలయానికి ఇరువైపుల నుంచీ వెళ్లిపోయింది కానీ ఆలయాన్ని టచ్ లేకపోయిందట. ఆ సమయంలో ఆలయంలో దాదాపు 500 మంది ఉన్నారు. అంతపెద్ద విలయం నుంచి వందల ప్రాణాలు కాపాడిన దమ్రునుమా శిలను భీమశిల అని పిలుస్తున్నారు. ఇదంతా పరమేశ్వరుడి లీల కాక మరేంటి అంటున్నారు భక్తులు.
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
Also Read: ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి