మృతి చెందిన మహిళకు కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజంగా ఇది జరిగింది. అయితే, ఆ చనిపోయిన మహిళకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా ఫోన్‌కి మెసేజ్ రావడం అందర్నీ ఆశ్చర్చానికి గురి చేస్తోంది. ఈ పరిణామం నమ్మశక్యంగా లేకపోయినా హైదరాబాద్‌లోని దమ్మాయిగూడ ప్రాంతంలో చోటు చేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Also Read: Nalgonda: గుడిలో పూజారి.. చేసింది మాత్రం పాడు పని.. భార్య కూడా సహకారం, షాక్ అయిన పోలీసులు
దమ్మాయిగూడకు చెందిన కె. కౌశల్య అనే 81 ఏళ్ల వృద్ధురాలు మే 4న కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకుంది. రెండు నెలల తర్వాత ఆమె వయసు పైబడడం, అనారోగ్యంతో మరణించింది. ఈ విషయం తెలియని స్థానిక ఆరోగ్య సిబ్బంది.. కరోనా రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకొనే గడువు సమీపిస్తుంని కౌశల్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఆమె చనిపోయి చాలా రోజులు అవుతుందని కుటుంబ సభ్యులు చెప్పేశారు.
Also Read: Hyderabad: బట్టలిప్పేసి నగ్నంగా పక్కింటికి వెళ్లిన యువకుడు.. ఏం చేశాడంటే..!
ఇదిలా ఉండగా.. 15 రోజుల అనంతరం నవంబర్ 8న కౌశల్య వ్యాక్సిన్ రెండో డోసు వేసుకున్నట్లుగా ఆమె ఫోన్‌కి ఓ మెసేజ్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. చనిపోయిన వ్యక్తికి రెండో డోసు ఎలా వేశారంటూ కంగు తిన్నారు. అయితే, వ్యాక్సిన్లు వేయించాలనే టార్గెట్‌ను ప్రభుత్వం విధించడం వల్లే.. ఆరోగ్య సిబ్బంది ఇలాంటి పొరపాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: క్షమాభిక్ష లేదని కోర్టు చెప్పేసింది.. కొన్ని గంటల్లోనే ఉరి శిక్ష.. అప్పుడే ఊహించని ట్విస్ట్
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయనున్నట్లు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కొద్ది రోజుల క్రితం తెలిపారు. వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్రస్థాయి సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌పై జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల కార్యదర్శులు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి కావాలని ఆదేశించారు.
Also Read: ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం.. ఆదర్శంగా నిలిచారంటూ IASపై ప్రశంసలు
Also Read: మటన్ కర్రీలో బూజు, చికెన్‌లో పురుగులు.. ఇలాంటి చోట్ల తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..!
Also Read: ప్రపంచంలోనే అతి పెద్ద నిధి.. తవ్వితే ఇంకాస్త దగ్గరలోనే.. వజ్రాలు, వైడూర్యాలు.. లక్ష కోట్ల పైమాటే