కార్తీకమాసం అనగానే నెలరోజుల పాటూ చన్నీటి స్నానాలు, దీపాలు... ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే.  పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలతో ఆలయాలు మారుమోగిపోతాయి. స్నానాలు, ఉపవాసాలు, దీపాలు అబ్బో ఓ రేంజ్ లో చేస్తుంటారు. కొందరైతే తమ అనారోగ్య సమస్యలని కూడా పక్కనపెట్టి భక్తిలో మునిగితేలుతారు. సూర్యోదయానికి ముందే స్నానం చేయకపోతే పాపం చుట్టుకుంటుందని కొందరు, ఉపవాసం ఉండకపోతే భక్తి కాదని అంటారేమో అని మరికొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. విపరీతమైన చలిలో చన్నీటి స్నానం చేయడం వల్ల అప్పటికే ఉన్న వీకెనెస్ బయటకు తన్నుకొచ్చి మరింత అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. 
Also Read:  అయ్యప్ప మాల వెనుక ఆరోగ్యం రహస్యం ఏంటి.. స్వామి అని ఎందుకు పిలవాలి...
వాస్తవానికి కార్తీకమాసంలో ఆచరించే ప్రతి నియమం మీరెంత పటిష్టంగా ఉన్నారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నారని టెస్ట్ చేసుకోవడం కోసమే. మొదటి వారం రోజులు మీరు పాటించిన నియమాల కారణంగా మీరు తేలికపడ్డారా, మరింత అనారోగ్య సమస్యల్లోకి కూరుకుపోయారా అన్నది గమనించుకోవాలి. కార్తీకమాసంలో ఈ నియమాలు పాటించకపోతే ఏదో జరుగుపోతుందనే భ్రమలో  ఉండొద్దని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక ఇళ్లలో స్నానం చేసేవారి సంఖ్య సరేకానీ నదుల్లో మునిగేవారు కూడా ఓసారి ఆలోచించాలి. అప్పట్లో ఇంత పొల్యూషన్ ఉండేది కాదు...చెరువుల నుంచి నదుల వరకూ అన్నింటిలో నీరు స్వచ్ఛంగా ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నీరు, ఆహారం , గాలి అన్నీ కలుషితం అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో భక్తి పేరుతో అనారోగ్యాన్ని పెంచుకోవద్దని సూచిస్తున్నారు. 
Also Read: 18 నంబర్ కి అయ్యప్పకి సంబంధం ఏంటి... మీ లక్షణాలను బట్టి మీరు ఎన్నో మెట్టుపై ఉన్నారో తెలుసుకోండి..
దేవుళ్లు, పురాణాలు భక్తులను భయపెట్టవు. మన జీవన విధానాన్ని సక్రమంగా మార్చుకునేందుకు కొన్ని నియమాలను సూచించి వాటికి భక్తి అనే ముసుగు వేశారు. కానీ ఈ విషయం గుర్తించని కొందరు మూర్ఖత్వంతో భక్తి ముసుగులో ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఇప్పటి కైనా మేల్కొనండి.  భక్తి అంటే మనసుకి సంబంధించిందే కానీ నియమాలకు సంబంధించినది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనస్ఫూర్తిగా భగవంతుడికి నమస్కారం చేసుకున్నా చాలు...
Also Read: వందేళ్ల తర్వాత కాశీకి చేరిన అన్నపూర్ణ విగ్రహం...ఈ నెల 15న పున:ప్రతిష్టాపన
Also Read: శివుడికే కాదు మనకూ మూడో కన్ను ఉందని మీకు తెలుసా...!
Also Read: శివుడి ఆజ్ఞ లేనిదే అక్కడ శిలైనా కదలదు...
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read:  ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి