సోమవారం సాయంత్రం నుంచి  అయ్యప్ప ఆలయం తెరుచుకోగా..స్వామివారి దర్శనాలకు భక్తులను మంగళవారం నుంచి అనుమతించనున్నారు. కేరళలో వైరస్‌ వ్యాప్తి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో కఠినమైన ఆంక్షలు విధించింది కేరళ ప్రభుత్వం. కరోనా ఆంక్షల కారణంగా రోజుకు 30 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. 
Also Read: అయ్యప్ప మాల వెనుక ఆరోగ్యం రహస్యం ఏంటి.. స్వామి అని ఎందుకు పిలవాలి...
అయ్యప్ప భక్తులు పాటించాల్సిన నిబంధనలు
 వ‌ర్చువ‌ల్ క్యూ బుకింగ్ వ్యవ‌స్థ ద్వారా దర్శనానికి అనుమ‌తిస్తారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న భక్తులు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ సమర్పించాల్సిన అవసరం ఉండదు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆధారాలను చూపించక పోయినా, సింగిల్ డోస్ వేసుకున్నా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ అందజేయాలి. ఈ నిబంధనలను పాటించని వారిని స్వామివారి దర్శనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరు.
Also Read: 18 నంబర్ కి అయ్యప్పకి సంబంధం ఏంటి... మీ లక్షణాలను బట్టి మీరు ఎన్నో మెట్టుపై ఉన్నారో తెలుసుకోండి..
అత్యవసర చికిత్స కేంద్రాలు..
శబరిమలకు వెళ్లే మార్గంలో నీలక్కళ్ వద్ద అధికారులు ప్రత్యేకంగా కరోనా  పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఐదు అత్యవసర వైద్య చికిత్స కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనితోపాటు పంప నుంచి సన్నిధానం వెళ్లే మార్గంలోనూ అత్యవసర వైద్య చికిత్స, ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రథమ చికిత్సను అందించడం, బ్లడ్ ప్రెషర్‌ను చెక్ చేయడం, గుండెపోటుకు గురయ్యే వారి కోసం ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నరల్ డీఫైబ్రిలేటర్‌ సౌకర్యాలు కల్పించారు. 
Also Read: వెయ్యేళ్లనాటి ఆ ఆలయం చుట్టూ రంధ్రాలు... ఎందుకో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు...
రవాణా సౌకర్యం..
భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 470 బస్సులను ఏర్పాటు చేసింది. వేర్వేరు నగరాలు, పట్టణాల నుంచి నేరుగా పంప వరకు ఈ బస్సులు నడుస్తాయి. నీలక్కళ్ నుంచి పంపా బేస్ క్యాంప్ వరకు షటిల్ సర్వీసుల కోసం 140 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సారి మండలం-మకరవిళక్కు సమయంలో కనీసం 10 లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారని కేరళ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది.
TSRTC ప్రత్యేక ఏర్పాట్లు
శబరిమల వెళ్లే భక్తులకు TSRTC గుడ్ న్యూస్ చెప్పింది.  తక్కువ ఛార్జీలతో శబరిమలకు స్పెషల్‌ బస్సులు అద్దెకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పూర్తి వివరాలను అధికారిక ట్విట్టర్‌లో పంచుకుంది.
1. 36 సీట్ల సూపర్‌ లగ్జరీ బస్సులను కిలోమీటర్‌కు రూ. 48.96 చొప్పున
2. 40 సీట్లు ఉన్న డీలక్స్‌ బస్సులను కిలోమీటర్‌ రూ. 47.20 చొప్పున
3. 48 సీట్లు ఉన్న డీలక్స్‌ బస్సులను రూ.56.64 చొప్పున
4. 49 సీట్లు ఉన్న ఎక్స్‌ప్రెస్‌ బస్స్ఉలను రూ. 52.43 చొప్పున అద్దెకు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.  
బస్సులన్నింటికీ గంటకు రూ. 300 చొప్పున వెయిటింగ్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు ట్వీట్ చేశారు తెలిపారు.






Also Read: భక్తి పేరుతో అనారోగ్యం కొనితెచ్చువద్దు... చాదస్తంతో ప్రాణాలను ఫణంగా పెట్టొద్దు..
Also Read: వందేళ్ల తర్వాత కాశీకి చేరిన అన్నపూర్ణ విగ్రహం...ఈ నెల 15న పున:ప్రతిష్టాపన
Also Read: శివుడికే కాదు మనకూ మూడో కన్ను ఉందని మీకు తెలుసా...!
Also Read: శివుడి ఆజ్ఞ లేనిదే అక్కడ శిలైనా కదలదు...
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read:  ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి