డెంగీ.. ప్రస్తుతం చాప కింద నీరులా పలు రాష్ట్రాల్లో వ్యాపిస్తోంది. ముఖ్యంగా దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రస్తుతం డెంగీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వెంటనే గుర్తించడం, సరైన చికిత్స తీసుకోవడం ద్వారా డెంగీకి చెక్ పెట్టొచ్చు. మరి డెంగీ లక్షణాలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
ఇవే లక్షణాలు..
వైద్యుడ్ని సంప్రదించాలి:
ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చికిత్స తీసుకోవడం ఆలస్యమైతే మరింత ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోగి పరిస్థితి ఆధారంగా రక్తం, ప్లేట్‌లెట్‌లు మార్చడం, ఆక్సిజన్ థెరపీ వంటి చికిత్సా విధానాలను వైద్యులు సూచిస్తారు.
లక్షణాలను గుర్తించడం..
స్వల్పంగా డెంగీ సోకితే రోగికి జ్వరంతో పాటు జలుబు, ఒళ్లు నొప్పులు, కడుపు నొప్పి, కండరాల నొప్పి, తలనొప్పి ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడం, నీరసం, రుచి పోవడం వంటి లక్షణాలుంటాయి.
చికిత్స..
డెంగీ సోకితే రోగి వీలైనంత ఎక్కువ సేపు రెస్ట్ తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి కివీ, బొబ్బాసి కాయ, దానిమ్మకాయ, బీట్‌రూట్, కాయగూరలు వంటివి ఎక్కువ తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు తాగాలి. ప్లేట్‌లెట్ కౌంట్‌ను గమనించుకోవాలి. లక్షణాల్లో ఏమైనా తేడా ఉంటే వైద్యులను ఎప్పటికప్పుడు సంప్రదించాలి.
డెంగీ పరీక్షలు..
డెంగీని గుర్తించడానికి వివిధ రకాల పరీక్షలు ఉన్నాయి. అయితే ఎక్కువగా రెండు పరీక్షలను వినియోగిస్తున్నారు.
- NS1.. దీనినే డెంగీ ఏంటిజెన్ టెస్ట్‌గా పిలుస్తారు. లక్షణాలు కనిపించిన 5 రోజుల లోపు ఈ పరీక్ష చేయాలి. అయితే లక్షణాలు ఎక్కువగా ఉంటే ఈ టెస్ట్ చేసినా అంత ప్రయోజనం ఉండదు.
- ఎలిసా పరీక్ష కూడా డెంగీని నిర్ధరించడానికి ఉపయోగిస్తారు. ఇందులో రెండు రకాల పరీక్షలు ఉంటాయి. ఐజీఎమ్, ఐజీజీ పరీక్షలు ఇందులో ఉంటాయి. ఐజీఎమ్ పరీక్ష లక్షణాలు గుర్తించిన 3-5 రోజుల లోపు చేయాలి. ఐజీజీ పరీక్షను 5-10 రోజుల లోపు చేయాలి.
Also Read: Delhi Pollution: ఉద్యోగులారా ఇక ల్యాప్ టాప్‌లు తీయండి.. మళ్లీ 'వర్క్ ఫ్రమ్ హోం'!
Also Read: Kabul Blast: అఫ్గానిస్థాన్‌లో బాంబుల మోత.. కాబూల్‌లో మరో పేలుడు
Also Read: Anil Deshmukh Remanded: 'ముందు జైలు కూడు తినండి..' మాజీ హోంమంత్రికి షాకిచ్చిన కోర్టు!
Also Read: Gujarat Drugs Seized: భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. వీటి విలువ రూ. 600 కోట్ల పైమాటే!
Also Read: Delhi Air Pollution: లాక్డౌన్ బాటలో దేశ రాజధాని.. కరోనా కోసం కాదు అంతకుమించి!
Also Read: Corona Cases: క్రమంగా తగ్గుతోన్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 10,229 కేసులు
Also read: తన గేదెపైనే కంప్లయింట్ ఇచ్చిన అమాయకపు రైతు... గేదె చేసిన తప్పు అదే
Also read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...