ABP  WhatsApp

Birsa Munda Jayanti: 'స్వతంత్ర భారతావనిలో గిరిజనులకు ఇంత గౌరవం దక్కడం ఇదే తొలిసారి'

ABP Desam Updated at: 15 Nov 2021 03:08 PM (IST)
Edited By: Murali Krishna

బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఆయన జయంతిని ప్రతి ఏటా 'జనజాతీయ గౌరవ్ దివస్‌'గా నిర్వహిస్తామని తెలిపారు.

బిర్సా ముండా జయంతి సందర్భంగా మోదీ నివాళులు

NEXT PREV

గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15ను ఇక నుంచి ఏటా 'జనజాతీయ గౌరవ్ దివస్​'గా జరుపుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బిర్సా ముండా స్మారకార్థం ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను మోదీ ఆవిష్కరించారు.





ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతోన్న ఈ సమయంలో గిరిజన యోధుల సాహసాలు, సంప్రదాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. గిరిజనుల కష్టసుఖాలను నేను దగ్గరుండి చూశాను. వారి జీవనవిధానం, అవసరాలు అన్నీ నాకు తెలుసు. కాబట్టి వ్యక్తిగతంగా ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం. బిర్సా ముండా జయంతి సందర్భంగా చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15ను ఇక నుంచి ఏటా 'జనజాతీయ గౌరవ్ దివస్​'గా నిర్వహించుకుందాం.                          -       నరేంద్ర మోదీ, ప్రధాని



మధ్యప్రదేశ్‌లో..

 

మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన జనజాతీయ గౌరవ్ దివస్ మహాసమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు. బిర్స ముండాకు నివాళులర్పించారు.

 


నేడు దేశం మొదటి జనజాతీయ గౌరవ్ దివస్ జరుపుకుంటున్నాం. స్వాంతంత్య్రం తర్వాత తొలిసారి గిరిజనుల కళ, సంప్రదాయాలు, స్వాతంత్య్రంలో వారి పాత్రకు తగిన గౌరవం లభించింది.                                                         - నరేంద్ర మోదీ, ప్రధాని

నివాళులు..

 

బిర్సా ముండా జయంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు.







కేంద్ర మంత్రులు, భాజపా నేతలు సహా పలువురు ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.


Published at: 15 Nov 2021 03:08 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.