దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు దేశ రాజధానిలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు తమ ప్రతిపాదనను సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంచింది.
దిల్లీతో పాటు నేషనల్ కేపిటల్ రీజైన్ (ఎన్‌సీఆర్)లో కూడా లాక్‌డౌన్ విధిస్తే మెరుగైన ఫలితం ఉంటుందని కేజ్రివాల్ సర్కార్ సుప్రీం కోర్టుకు తెలిపింది.
చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు పంట వ్యర్థాలు తగలబెట్టడమే వాయు కాలుష్యం ఎక్కువ అవ్వడానికి కారణమని కేజ్రీ సర్కార్ పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను కేంద్రం ఖండించింది. పంట వ్యర్థల తగలబెట్టడం మాత్రమే కాలుష్యానికి కారణం కాదని సుప్రీం కోర్టుకు వెల్లడించింది. ఎందుకంటే మొత్తం కాలుష్యంలో పంట వ్యర్థాల ప్రభావం 10 శాతం మాత్రమే ఉన్నట్లు పేర్కొంది.
సుప్రీం ఆందోళన..
దిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. దిల్లీలో ప్రస్తుతం 'అత్యవసర పరిస్థితి' నెలకొందని ఇంట్లోనూ మాస్కులు ధరించాల్సి వస్తోందని పేర్కొంది. దిల్లీలో వాయు కాలుష్యంపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
దిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. రెండు మూడు రోజుల్లో అది మరింత ప్రమాదకరంగా మారతుంది. కాలుష్యం కట్టడికి తక్షణమే ఓ నిర్ణయం తీసుకోండి. అనంతరం మనం శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిద్దాం. వాయు నాణ్యత సూచీని 500 నుంచి 200 పాయింట్లకు ఎలా తగ్గించగలం? రెండు రోజులపాటు లాక్‌డౌన్ విధించవచ్చేమో ఆలోచించండి. ఈ వాతావరణం మధ్యే పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. వారిని మనం వాయు కాలుష్య ప్రభావానికి గురయ్యేలా చేస్తున్నాం. - సుప్రీం ధర్మాసనం
గాలి కాలుష్యం కారణంగా కరోనా, డెంగీ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ గులేరియా ఇటీవలే తెలిపారు.
Also Read: Corona Cases: క్రమంగా తగ్గుతోన్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 10,229 కేసులు
Also read: తన గేదెపైనే కంప్లయింట్ ఇచ్చిన అమాయకపు రైతు... గేదె చేసిన తప్పు అదే
Also read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...