గుజరాత్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. భారీ ఎత్తున మత్తు పదార్థాలను ఆ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పట్టుకుంది. ద్వారకాలోని మోర్బిలో 120 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందన్నారు.
రాష్ట్ర పోలీసులు, ఏటీఎస్‌పై గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘవి ప్రశంసలు కురిపించారు.
నవ్లఖి నౌకాశ్రయానికి దగ్గరలోని జిన్జుడా గ్రామంలో మత్తుపదార్థాల ముఠా ఉందనే ముందస్తు సమాచారంతో ఆదివారం రాత్రి ఏటీఎస్ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో 120 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.
మత్తు పదార్థాల ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్‌లో ముంద్రా పోర్టు నుంచి సుమారు రూ.21 వేల కోట్ల విలువైన 3 వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Delhi Air Pollution: లాక్‌డౌన్ బాటలో దేశ రాజధాని.. కరోనా కోసం కాదు అంతకుమించి!
Also Read: Corona Cases: క్రమంగా తగ్గుతోన్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 10,229 కేసులు
Also read: తన గేదెపైనే కంప్లయింట్ ఇచ్చిన అమాయకపు రైతు... గేదె చేసిన తప్పు అదే
Also read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...