దిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. వాయు కాలుష్యం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సీఆర్) ఉన్న ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం విధానం అమలు చేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.


తప్పుబట్టిన సుప్రీం..


రైతులు పంట వ్యర్థాలు కాల్చడమే వాయు కాలుష్యానికి కారణమని దిల్లీ ప్రభుత్వం పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ తరహా కుంటిసాకులు అర్థం లేనివని చురకలు అంటించింది. దిల్లీలో ఏయే పరిశ్రమలను ఆపొచ్చు? ఏ వాహనాలను నిషేధించవచ్చు? ఏయే విద్యుత్​ ఉత్పత్తి కేంద్రాలను ఆపొచ్చు? వంటి వాటిపై మంగళవారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పంటవ్యర్థాలు కాల్చడం వల్ల 10 శాతం మాత్రమే కాలుష్యం ఏర్పడుతోందని కేంద్రం పేర్కొంది.


అత్యవసర భేటీ..


వాయు కాలుష్యం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై రేపు అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. పంజాబ్​, ఉత్తర్​ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ భేటీకీ హాజరు కావాలని చెప్పింది. తదుపరి విచారణను నవంబరు 17కు వాయిదా వేసింది.


Also Read: Kabul Blast: అఫ్గానిస్థాన్‌లో బాంబుల మోత.. కాబూల్‌లో మరో పేలుడు


Also Read: Anil Deshmukh Remanded: 'ముందు జైలు కూడు తినండి..' మాజీ హోంమంత్రికి షాకిచ్చిన కోర్టు!