Kabul Blast: అఫ్గానిస్థాన్‌లో బాంబుల మోత.. కాబూల్‌లో మరో పేలుడు

ABP Desam Updated at: 15 Nov 2021 04:50 PM (IST)
Edited By: Murali Krishna

అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో మరో పేలుడు జరిగింది.

అఫ్గానిస్థాన్ కాబూల్‌లో పేలుడు

NEXT PREV

అఫ్గానిస్థాన్ బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. కాబూల్‌లో తాజాగా మరో పేలుడు జరిగింది. అయితే ఈ పేలుడులో క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ పేలుడు మ్యాగ్నెటిక్ మైన్ కారణంగా జరిగినట్లుగా తెలుస్తోంది.


పాజ్‌వాక్ అప్గాన్ న్యూస్ ప్రకారం ఈ పేలుడులో ఇద్దరికి గాయాలైనట్లు తెలిసింది. అయితే తాలిబన్ల అధికార యంత్రాంగం ఈ పేలుడుపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 



నేను నా షాపుకు వచ్చిన కస్టమర్‌తో మాట్లాడుతున్నాను. ఈలోపు పెద్ద శబ్దం వినిపించింది. కొంతమంది క్షతగాత్రులను ఆ ప్రాంతం నుంచి తరలిస్తున్నారు. వాళ్లకి గాయాలయ్యాయో, మృతి చెందారో తెలియదు.                                                 - ప్రత్యక్ష సాక్షి


జంట పేలుళ్లు..


అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత బాంబు పేలుళ్లు ఎక్కువయ్యాయి. కాబుల్‌ విమానాశ్రయంపై ఇటీవల జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో 108 మంది మరణించారు. ఇందులో 13 మంది అమెరికా సైనికులు కాగా.. 95 మంది అఫ్గాన్‌ వాసులు. 150 మంది గాయపడ్డారు. ఈ దాడికి ఐఎస్‌ఐఎస్‌-ఖోర్సా బాధ్యత తీసుకుంది. మృతుల్లో 28 మంది తమ వారు కూడా ఉన్నారని తాలిబన్లు ప్రకటించారు.


అమెరికా బలగాలు అఫ్గాన్‌ను వీడిన తర్వాత తాలిబన్లు మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కప్పటి హింసాకాండకు, నియంత చర్యలకు పాల్పడమని చెప్పినప్పటికీ మహిళలపై అరాచకాలు అలానే కొనసాగుతున్నాయి. మహిళలను విధుల్లోకి హాజరుకాకుండా తాలిబన్లు నియంత్రిస్తున్నారు. కో- ఎడ్యుకేషన్‌ను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. అఫ్గాన్ మహిళల వస్త్రధారణపైనా ఆంక్షలు విధించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని ఆదేశాలు జారీ చేశారు.


జర్నలిస్టులపై కూడా దాడులు పెరిగిపోయాయి. తమకు వ్యతిరేకంగా పనిచేసే జర్నలిస్టులను బహిరంగంగానే కాల్చిచంపారు. అయితే పైకి మాత్రం అంతా సవ్యంగా ఉందంటున్నారు. సరిహద్దు దేశాలతో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని తాలిబన్లు అంటున్నారు అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.


Also Read: Anil Deshmukh Remanded: 'ముందు జైలు కూడు తినండి..' మాజీ హోంమంత్రికి షాకిచ్చిన కోర్టు!



Published at: 15 Nov 2021 04:36 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.