విజయ్ సేతుపతి హీరోగా... నయనతార, సమంత హీరోయిన్లుగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అందులో సమంత ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేశారు. ఖతీజా పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు. పేరును బట్టి ఆమె ముస్లిం అమ్మాయిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ కుమార్తె పేరు ఖతీజానే. దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆ పేరు నచ్చి సమంత పాత్రకు పెట్టారో? లేదంటే పాత్రకు సూటవుతుందని పెట్టారో? చూడాలి.





విజయ్ సేతుపతి, నయనతార జంటగా గతంలో దర్శకుడు విఘ్నేష్ శివన్ 'నేనూ రౌడీనే' (తమిళంలో 'నానుమ్ రౌడీ దాన్') తీశారు. ఆ తర్వాత మరోసారి వాళ్లిద్దరితో చేస్తున్న చిత్రమిది. ఇందులో మరో హీరోయిన్ సమంతను కూడా తీసుకున్నారు. తొలుత ఈ సినిమాకు తమిళంలో 'కదువాకుళ రెండు కాదల్' అని టైటిల్ పెట్టారు. 'తలుపు వెనుక రెండు ప్రేమకథలు' అని అర్థం. ఇప్పుడు టైటిల్‌లో ఓ మార్పు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు 'కాతువాకుళే రెండు కాదల్' టైటిల్ ఖరారు చేశారట. దీనికి 'గాలివాటంగా రెండు ప్రేమకథలు' అని అర్థమట.





సమంత ఫస్ట్ లుక్ చూస్తుంటే... ఆమె ఒక పబ్ లో ఉన్నట్టు అర్థమవుతోంది. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు. సమంతతో పాటు ఈ రోజు విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఆయన రాంబో పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి  కథియవాడి'
Also Read: సన్నీ & కో ని టార్గెట్ చేశారా... బిగ్ బాస్ హౌస్ లో పదకొండోవారం నామినేషన్ల హీట్
Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్
Also Read: పెద్ద‌మ్మ త‌ల్లి ఆశీస్సులు తీసుకుని... ఫ‌స్ట్ డే షూటింగ్‌కు వెళ్లిన మెగాస్టార్ దర్శకుడు
Also Read: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు
Also Read: జోరుమీదున్న అక్షయ్ ... ఆకట్టుకుంటోన్న 'పృథ్వీరాజ్' టీజర్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి