నల్గొండ జిల్లాలో ఓ వ్యక్తి కత్తి పీటతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉన్నట్టుండి ఆయన గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు గల కారణాలు ఎవరికీ అంతుబట్టడం లేదు. భార్యా పిల్లలు మరో ఊరికి వెళ్లినప్పుడు ఈయనే ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఆ సందర్భంలోనే ఒంటరిగా ఉన్న సమయంలో గొంతు కోసుకున్నాడు. స్థానికులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నల్గొండ జిల్లాలో కత్తిపీటతో గొంతు కోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని నూతన్ కల్ ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతన్ కల్ మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి రాములు అనే వ్యక్తి తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి భార్య ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తోంది. వీరి ఇద్దరు పిల్లలు ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. కాగా, తన ఉద్యోగరీత్యా ట్రైనింగ్ కోసం రాములు భార్య రెండు రోజులుగా నల్గొండలో ఉంటోంది. అయితే, ఏమైందో ఏమో తెలియదు కానీ రాములు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తి పీటతో గొంతు కోసుకున్నాడు.
Also Read: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు
ఇంట్లో అలికిడి వినపడడంతో పక్కనే నివాసం ఉంటున్న తండ్రి సాయిలు వీరి ఇంట్లోకి వెళ్లి చూశాడు. కుమారుడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండడంతో కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి వారి సాయంతో రాములును సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కాగా, ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌లోనూ..
మద్యం మత్తులో భార్యతో గొడవ పడి బ్లేడ్‌తో గొంతు కోసుకుని హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌లో నివసించే వెంకటేష్ అనే 36 ఏళ్ల వ్యక్తి తాపీ మేస్త్రి. అతడు కొంతకాలంగా పనికి వెళ్లకుండా మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య సూర్య కుమారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. చేతిలో డబ్బు లేకపోవడంతో మద్యం తాగేందుకు వెంకటేష్ అప్పులు చేయడం ప్రారంభించాడు. సోమవారం డబ్బు అప్పు తీసుకుని మద్యం తాగి ఇంటికి వెళ్లగా భార్య అతడిని నిలదీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన వెంకటేష్ మద్యం మత్తులో బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని యశోద ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఏపీకి రెయిన్ అలర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు.. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఇలా!
Also Read: నా భార్య బజారుకీడుస్తోంది, చచ్చిపోతున్నా.. పురుగుల మందు తాగేసిన బ్యాంకు ఉద్యోగి.. చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి