కోలీవుడ్ లో నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న ఆర్.ఎన్.ఆర్. మనోహర్ గుండెపోటుతో కన్నుమూశారు. కరోనా సోకడంతో ఇరవై రోజులుగా మనోహర్ ను చెన్నైలోని ప్రయివేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో హాస్పిటల్ లోనే మరణించారు. 


Also Read: పవన్ ని ఒప్పించడానికి దిల్ రాజు ప్రయత్నాలు..


అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన మనోహర్ వెటరన్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ వద్ద పని చేశారు. 'బ్యాండ్ మాస్టర్', 'సూరియన్ చంద్రన్' లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు మనోహర్. అలానే 1990లలో వచ్చిన పలు చిత్రాలకు కో డైరెక్టర్ గా పని చేశారు. రైటర్ గా కూడా ఎన్నో సినిమాలను పని చేశారు. 'తెన్నెవన్', 'పున్నగై' వంటి సినిమాలు రచయితగా ఆయనకు మంచి పేరుని తీసుకొచ్చాయి. 2009లో వచ్చిన 'మాసిలమణి' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు మనోహర్. 


ఆ తరువాత తన దృష్టి మొత్తం నటనపై పెట్టారు. 'ఎన్నై అరిందాల్', 'వీరమ్', 'తీరన్ అదిగారం ఒండ్రు', 'మిరూథన్', 'భూమి', 'టెడ్డీ', 'విశ్వాసం', 'ఖైదీ' లాంటి హిట్ సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు మనోహర్. మనోహర్‌ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు.