సిరిసిల్ల మానేరు నదిలో నీటిలో మునిగి చనిపోయిన ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులను రాజీవ్ నగర్లో మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


అసలేం జరిగిందంటే..


సిరిసిల్ల పట్టణంలో శివనగర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు సోమవారం సాయంత్రం  మానేరు వాగులో ఈతకొట్టడానికి వెళ్లారు. నెహ్రు నగర్ చెక్ డ్యాం వద్ద వీరంతా ఈతకు దిగారు. కొందరు విద్యార్థులు నీటిలో లోతులోకి వెళ్లారు. ఇలా ఆరుగురు విద్యార్ధులు మునిగిపోయారు. 


స్నేహితులు నీటిలో మునిగిపోవడంతో.. మిగిలిన ముగ్గురు విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఏం చేయాలో తెలియక..  ఇంటికి పరుగెత్తారు. అందరికీ ఈ విషయం చెప్పారు. వారిద్వారా ఈ ఘటన గురించి తెలుసుకున్న కాలనీవాసులంతా ప్రమాదం  జరిగిన ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే విద్యార్థులంతా మునిగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే  పోలీసులు, రెస్క్యూ టీం ఘటనా స్థలికి వచ్చారు. సోమవారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఒకరి మృతదేహం లభ్యమైంది.


మిగతా ఐదుగురి కోసం సోమవారం సాయంత్రం నుంచి పోలీసులు, రెస్క్యూ టీం  గాలింపు చర్యలు చేపటారు. మంగళవారం మరో నలుగురి విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. బుధవారం ఉదయం.. ఆరో విద్యార్థి మృతదేహం కూడా లభ్యమైంది. ఈత రాకపోవడంతో బాటు నీటి లోతుని అంచనా వేయడంలో జరిగిన పొరబాటు ఈ విషాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనతో పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఒకే ప్రాంతానికి చెందిన పిల్లలు అదీ ఉత్సాహంగా రోజంతా గడిపిన తరువాత ఆకస్మికంగా మరణించడం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.


Also Read: Hyderabad Crime: అమ్మానాన్నలు చేసేది పాడుపనులు.. కుమార్తెకు సైతం ట్రైనింగ్.. చివరికి అడ్డంగా దొరికిపోయి!


Also Read: Siricilla: ఈతకు వెళ్లి నీట మునిగిన ఆరుగురు విద్యార్థులు.. ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యం


Also Read: Lover's Suicide: ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య... పురుగుల మందు తాగి ప్రయాణం... సిబ్బంది స్పందించినా నిలవని ప్రాణాలు


Also Read: Wife Stabs Husband: తన బంధువుల పెళ్లికి రానన్నాడని భర్తను కత్తితో పొడిచిన భార్య, చివరికి..


Also Read: Hyderabad Crime: టాయిలెట్‌కు వెళ్తే కాపీ కొట్టినట్టేనా? బాలిక బట్టలు విప్పించిన హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి