రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఈత సరదా ఆరుగురు విద్యార్థులను బలితీసుకుంది. మానేరు వాగులో సరదాగా ఈతకొట్టడానికి దిగిన విద్యార్థులు బాగా లోతులోకి వెళ్లి మునిగారు. ఒకేసారి ఆరుగురు మృత్యువాతపడటంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది.
సిరిసిల్ల పట్టణంలో శివనగర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు సోమవారం సాయంత్రం మానేరు వాగులో ఈతకొట్టడానికి వెళ్లారు. నెహ్రు నగర్ చెక్ డ్యాం వద్ద వీరంతా ఈతకు దిగారు. కొందరు విద్యార్థులు నీటిలో లోతులోకి వెళ్లారు. ఇలా ఆరుగురు విద్యార్ధులు మునిగిపోయారు.
స్నేహితులు నీటిలో మునిగిపోవడంతో.. మిగిలిన ముగ్గురు విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఏం చేయాలో తెలియక.. ఇంటికి పరుగెత్తారు. అందరికీ ఈ విషయం చెప్పారు. వారిద్వారా ఈ ఘటన గురించి తెలుసుకున్న కాలనీవాసులంతా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే విద్యార్థులంతా మునిగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీం ఘటనా స్థలికి వచ్చారు. సోమవారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఒకరి మృతదేహం లభ్యమైంది.
మిగతా ఐదుగురి కోసం సోమవారం సాయంత్రం నుంచి పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపటారు. ఈరోజు మరో నలుగురి విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈత రాకపోవడంతో బాటు నీటి లోతుని అంచనా వేయడంలో జరిగిన పొరబాటు ఈ విషాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనతో పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఒకే ప్రాంతానికి చెందిన పిల్లలు అదీ ఉత్సాహంగా రోజంతా గడిపిన తరువాత ఆకస్మికంగా మరణించడం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు లభ్యమైన విద్యార్థి క్రాంతికుమార్ పుట్టినరోజు కావడంతో తల్లిందండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి.
Also Read: AP Highcourt : అమరావతి ప్రజలందరి రాజధాని.. విచారణలో హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు !
Also Read: AP Mlc Elections: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల... నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ
Also Read: వచ్చే ఏడాది నుంచి వరంగల్‌కు విమానాలు... ఏఏఐను తుది నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం